‘సైరా నరసింహారెడ్డి’ కోసం సాహసం చేయరా ఢింబకా అంటున్న చిరంజీవి..

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం చిరంజీవి నిత్యం ఫిట్‌నెస్ కోసం చెమటోడుస్తున్నాడు. తన వయసును కూడా పట్టించుకోకుండా ఒళ్ళొంచుతున్నాడు. ఈయన కష్టం చూసి టీం కూడా షాక్ అవుతున్నారు. ఇక ఇప్పుడు మరో సాహసం చేస్తున్నాడు మెగాస్టార్. సైరాలో అండర్‌ వాటర్‌ వార్‌ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ సీక్వెన్స్ కోసం హాలీవుడ్‌ నుంచి ప్రత్యేకంగా వచ్చిన టీం గైడెన్స్‌లోనే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు చిరు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 18, 2019, 10:11 PM IST
‘సైరా నరసింహారెడ్డి’ కోసం సాహసం చేయరా ఢింబకా అంటున్న చిరంజీవి..
‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవి (ఫైల్ ఫోటో)
  • Share this:
చిరంజీవి ఎక్క‌డున్నాడు..? ఆయ‌న షూటింగ్‌లో ఉన్నాడా లేదంటే ఇక్క‌డే ఉన్నాడా..? అస‌లు మెగాస్టార్ సైరా షూట్‌లోనే ఉన్నాడా..? ఇప్పుడు ఈ అనుమానాలు ఎందుకు ఎందుకు వ‌స్తున్నాయి అనుకుంటున్నారా..? కొన్ని రోజుల నుంచి ఈయ‌న ఇండియాలోనే ఉన్నాడు. ఆ మధ్య "సైరా" యూనిట్ జార్జియా వెళ్లి షూటింగ్ చేసుకుని వచ్చిన తర్వాత ఇండియా దాటలేదు. ఇక్కడే కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయింది. యాక్షన్ సీన్స్ ఈ చిత్రంలో హైలైట్‌గా నిలవనున్నాయి. వార్ సీన్స్‌తో పాటు మ‌రిన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల‌ను కూడా ఇప్పుడు చిత్రీక‌రించ‌నున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి.

Chiranjeevi Underwater Action Sequences major Highlight in Sye Raa Narasimha Reddy Movie.. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం చిరంజీవి నిత్యం ఫిట్‌నెస్ కోసం చెమటోడుస్తున్నాడు. తన వయసును కూడా పట్టించుకోకుండా ఒళ్ళొంచుతున్నాడు. ఈయన కష్టం చూసి టీం కూడా షాక్ అవుతున్నారు. ఇక ఇప్పుడు మరో సాహసం చేస్తున్నాడు మెగాస్టార్. సైరాలో అండర్‌ వాటర్‌ వార్‌ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ సీక్వెన్స్ కోసం హాలీవుడ్‌ నుంచి ప్రత్యేకంగా వచ్చిన టీం గైడెన్స్‌లోనే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు చిరు. sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,megastar chiranjeevi,georgia,syeraa narasimhareddy, shooting,schedule,surender reddy,nayanatara,tamannah bhatia,amitabh bachchan,telugu cinema,చిరంజీవి,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా,నయనతార, విజ‌య్ సేతుప‌తి, అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,జార్జియా షెడ్యూల్, టాలీవుడ్ న్యూస్
సైరా విజయ్ సేతుపతి సుదీప్ పిక్స్

విజ‌య్ సేతుప‌తి, అమితాబ్ బ‌చ్చ‌న్, న‌య‌న‌తార కూడా ఈ షెడ్యూల్లో ఉన్నారు. యాక్ష‌న్ సీన్స్ కోసం ఇప్పుడు చిరంజీవి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. మరోవైపు ఈ సినిమాలో కొన్ని అండర్‌ వాటర్‌ వార్‌ సీన్స్ కూడా ఉన్నాయి. వీటి కోసం ఇప్పుడు ప్రత్యేకంగా తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు మెగాస్టార్. ఈ షెడ్యూల్‌ అంతా ముంబైలోనే జరగనుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ స్విమ్మింగ్‌ పూల్‌లో ఈ యాక్షన్‌ ఘట్టాలను చిత్రీకరించనున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ సీక్వెన్స్ కోసం ఇప్పుడు హాలీవుడ్‌ నుంచి ప్రత్యేకంగా యాక్షన్‌ టీమ్‌ వచ్చింది. వారి గైడెన్స్‌లోనే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు చిరు.

Chiranjeevi Underwater Action Sequences major Highlight in Sye Raa Narasimha Reddy Movie.. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం చిరంజీవి నిత్యం ఫిట్‌నెస్ కోసం చెమటోడుస్తున్నాడు. తన వయసును కూడా పట్టించుకోకుండా ఒళ్ళొంచుతున్నాడు. ఈయన కష్టం చూసి టీం కూడా షాక్ అవుతున్నారు. ఇక ఇప్పుడు మరో సాహసం చేస్తున్నాడు మెగాస్టార్. సైరాలో అండర్‌ వాటర్‌ వార్‌ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ సీక్వెన్స్ కోసం హాలీవుడ్‌ నుంచి ప్రత్యేకంగా వచ్చిన టీం గైడెన్స్‌లోనే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు చిరు. sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,megastar chiranjeevi,georgia,syeraa narasimhareddy, shooting,schedule,surender reddy,nayanatara,tamannah bhatia,amitabh bachchan,telugu cinema,చిరంజీవి,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా,నయనతార, విజ‌య్ సేతుప‌తి, అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,జార్జియా షెడ్యూల్, టాలీవుడ్ న్యూస్
సైరా షూటింగ్ పిక్

అంతేకాదు.. ఈ చిత్రం కోసం చిరు ఫిజికల్‌గా చాలా కష్టపడుతున్నాడు. నిత్యం ఫిట్‌నెస్ కోసం చెమటోడుస్తున్నాడు. తన వయసును కూడా పట్టించుకోకుండా ఒళ్ళొంచుతున్నాడు. ఈ సినిమా కోసం లీ విక్టర్.. గ్రెగ్ పావెల్ లాంటి హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్లు పని చేస్తున్నారు. ఇప్పుడు మరో టీం కూడా వస్తుంది. వారి ఆధ్వ‌ర్యంలోనే ఇప్పుడు అండర్ వాటర్ వార్ సీన్స్ చిత్రీక‌రించ‌నున్నాడు. కేవలం 8 నిమిషాల సీన్ కోసం ఏకంగా 54 కోట్లు ఖర్చు చేస్తున్నాడు నిర్మాత రామ్ చరణ్. వచ్చే ఏడాది "సైరా" విడుదల కానుంది. త‌మ‌న్నా ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు సురేంద‌ర్ రెడ్డి. మొత్తానికి చిరు కష్టం చూసి యూనిట్ కూడా అంతా వావ్ అంటూ నోరెళ్లబెడుతున్నారిప్పుడు.
First published: January 18, 2019, 10:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading