HOME »NEWS »MOVIE »chiranjeevi tweets and reveals the temple set erected for acharya mhn

Chiranjeevi - Aacharya: 'ఆచార్య' కోసం వేసిన భారీ టెంపుల్‌ సెట్‌ ఎలా ఉందో చూసేయండి..

Chiranjeevi - Aacharya: 'ఆచార్య' కోసం వేసిన భారీ టెంపుల్‌ సెట్‌ ఎలా ఉందో చూసేయండి..
Chiranjeevi tweets and reveals the temple set erected for Acharya

Chiranjeevi - Aacharya: ఆచార్య కోసం వేసిన భారీ టెంపుల్‌ సెట్‌ను చిరంజీవి తన మొబైల్‌లో చిత్రీకరించి ట్వీట్‌ చేశాడు.

  • Share this:
    మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన కోకాపేటలో భారీ టెంపుల్‌ సెట్‌ వేసి చిత్రీకరిస్తున్నారు. 20 ఎకరాల్లో వేసిన ఈ సెట్‌ ఇండియాలోనే అతి పెద్దదైన టెంపుల్‌ సెట్‌. ఇదెలా ఉంటుందోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి తమ 'ఆచార్య' సినిమా కోసం వేసిన సెట్‌ తన ఫోన్‌లో చిత్రీకరించి ఆ వీడియోను ట్వీట్‌ చేశారు. ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ సెట్‌ ఇదని పేర్కొన్న చిరంజీవి. ఆ సెట్‌ కోసం పడ్డ కష్టం చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. అంత పెద్ద టెంపుల్‌ సెట్‌ను విజువలైజ్‌ చేసిన డైరెక్టర్‌ కొరటాల శివకు, అలాగే అంత పెద్ద గుడి సెట్‌ను వేసిన ఆర్ట్‌ డైరెక్టర్ సురేశ్‌కు, అంత పెద్ద సెట్‌ను వేయడానికి డబ్బులు సమకూర్చిన నిర్మాతలు నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌లకు చిరంజీవి ప్రత్యేకంగా చెప్పారు.

    దేవాదాయ శాఖలో జరిగే అవినీతిని ప్రశ్నించేలా ఈ సినిమా ఉంటుంది. ఇందులో రామ్‌చరణ్‌ పవర్‌పుల్‌ నక్సలైట్‌ నాయకుడి పాత్రలో కనిపిస్తే.. చిరంజీవి మాజీ నక్సలైట్‌ పాత్రలో కనిపిస్తారు. ధర్మస్థలి అనే ప్రాంతంలో జరిగే కథాంశం ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళనాడు సహా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన దేవాలయాల భూముల అన్యాక్రాంతంను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని డైరెక్టర్‌ కొరటాల శివ ఈ కథను సిద్ధం చేశారు.




    చిరంజీవి 152వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంటే.. సోనూసూద్‌ విలన్‌ పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణలో రామ్‌చరణ్‌ కూడా పాల్గొంటాడు.
    Published by:Anil
    First published:January 06, 2021, 18:30 IST