చిరంజీవికి సీఎం జగన్ నుంచి పిలుపు... మీటింగ్ డేట్ ఫిక్స్?

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌ల కోసం అనుమతి కోరుతున్న టాలీవుడ్‌కు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నుంచి పిలుపువచ్చినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: June 5, 2020, 7:11 PM IST
చిరంజీవికి సీఎం జగన్ నుంచి పిలుపు... మీటింగ్ డేట్ ఫిక్స్?
సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌ల కోసం అనుమతి కోరుతున్న టాలీవుడ్‌కు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నుంచి పిలుపువచ్చినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ కార్యాలయం నుంచి చిరంజీవికి సమాచారం అందించారు. ఈనెల 9వ తేదీన మంగళవారం రోజు సీఎం జగన్‌మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ ఫిక్స్ చేశారు. ఆ రోజు రావాల్సిందిగా చిరంజీవి బృందానికి సమాచారం ఇచ్చారు. చిరు అండ్ టీమ్ ఆ రోజు హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సమావేశం అయిన సందర్భంలో నందమూరి బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలతో దుమారం రేపారు. తలసానితో కలసి భూములు పంచుకుంటున్నారంటూ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఈ క్రమంలో జగన్‌తో జరిగే సమావేశానికి బాలయ్యను కూడా పిలవాలని నిర్ణయించారు. బాలయ్యకు దగ్గరగా ఉండే ఓ సినీ నిర్మాత ద్వారా ఈ సమాచారాన్ని చేరవేయనున్నారు. అలాగే, ప్రస్తుతం ఎవరి సినిమాలు అయితే షూటింగ్ దశలో నిలిచిపోయాయో, ఆయా చిత్రాలతో సంబంధం ఉన్న వారిని మాత్రమే జగన్‌తో భేటీకి హాజరుకానున్నట్టు తెలిసింది. సినిమాలు చేతిలో లేని దర్శకులు, నిర్మాతలు అందరినీ పక్కన పెట్టనున్నారు. చిరంజీవికి దగ్గరగా ఉండే ఓ దర్శకుడికి ప్రస్తుతం సినిమాలు లేకపోవడంతో అతడిని కూడా ఈ భేటీకి హాజరుకావొద్దని స్పష్టం చేసినట్టు తెలిసింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 5, 2020, 7:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading