హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi | God Father : కరోనా నుంచి కోలుకున్న చిరంజీవి.. గాడ్‌ ఫాదర్‌ షూటింగ్‌లో మెగాస్టార్..

Chiranjeevi | God Father : కరోనా నుంచి కోలుకున్న చిరంజీవి.. గాడ్‌ ఫాదర్‌ షూటింగ్‌లో మెగాస్టార్..

Chiranjeevi Photo : Twitter

Chiranjeevi Photo : Twitter

Chiranjeevi | God Father : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

  మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ (Lucifer) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God Father) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈసినిమాలో చిరంజీవి ఈ నెల 8 నుంచి షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. కరోనా నుంచి చిరంజీవి కోలుకోవడంతో ఆయన షూటింగ్‌‌లో పాల్గోనబోతున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. నయనతార, సత్యదేవ్ తదితరులపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే దాదాపు 45 శాతం షూటింగ్ కంప్లీట్ తెలుస్తోంది. ఇక ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

  ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మాతృకలో వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) పోషించిన బాబీ పాత్రలో బిజు మీనన్ బాబీ నటించనున్నాడట. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. మరో కీలకపాత్రలో యువ హీరో సత్యదేవ్ నటిస్తున్నాడని తెలుస్తోంది. మోహన్ రాజా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను యాడ్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

  Nabha Natesh: బూడిద రంగు డ్రెస్‌లో క్యూట్‌గా అదరగొట్టిన నభా నటేష్..

  ఇక చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న మరో సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తన 152వ చిత్రాన్ని చేస్తున్నారు. ఆచార్య ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ ఓ మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట. ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Chiranjeevi, God father, Nayanthara, Tollywood news

  ఉత్తమ కథలు