Chiranjeevi Marriage: చిరంజీవి, సురేఖల పెళ్లి ఎలా జరిగిందో తెలిస్తే ఆశ్యర్యపోతారు..

Chiranjeevi | చిరంజీవి హీరోగా ఎదుగుతున్న టైమ్‌లోనే ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖను తమ అమ్మానాన్నల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహాం ఎలా జరిగిందంటే..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 19, 2020, 2:28 PM IST
Chiranjeevi Marriage: చిరంజీవి, సురేఖల పెళ్లి ఎలా జరిగిందో తెలిస్తే ఆశ్యర్యపోతారు..
చిరంజీవి సురేఖ వివాహ వార్షికోత్సవం
  • Share this:
తెలుగులో ఇండస్ట్రీలో బుల్లెట్‌లా వచ్చి రాకెట్ వేగంతో దూసుకుపోయి మెగాస్టార్‌గా మారాడు చిరంజీవి. తనదైన నటన, డాన్సులతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పెద్ద మనిషిగా తల్లో నాలుకగా వ్యవహరిస్తున్నాడు. ఇక చిరంజీవి హీరోగా ఎదుగుతున్న టైమ్‌లోనే ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖను తమ అమ్మానాన్నల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యలో చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి తన పెళ్లి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సురేఖను తనకు ఇచ్చి పెళ్లి చేసే విషయంలో అల్లు రామ లింగయ్య  నా గురించి ఎన్నో విషయాలను ఆరా తీశారు. అపుడపుడే ఇండస్ట్రీలో పైకొస్తోన్న నాకు పెళ్లి చేసుకోనే ఆలోచన లేదు. కానీ సినిమా ప్రపంచంలో ఉండే నేను వేరే ఆకర్షణలకు లొంగిపోతానేమోననే భయంతో మా వాల్లు బలవంతంగా ఒప్పించి పెళ్లి చూపులకు తీసుకెళ్లారు. మా వివాహాం కుదిరిన సురేఖతో నేను ఎక్కువగా మాట్లాడలేదు.

chiranjeevi tells about his marriage with surekha here are the details,Chiranjeevi,chiranjjevi surekha,surekha,chiranjeevi wife surekha,chiranjeev maa,maa association,chiranjeevi,rajasekhar,chiranjeevi,hero rajasekhar,rajasekhar about chiranjeevi,rajasekhar movies,jeevitha rajasekhar,rajasekhar chiranjeevi,rajasekhar and chiranjeevi,rajasekhar meets chiranjeevi,rajasekhar jeevitha chiranjeevi,megastar chiranjeevi,rajasekhar jeevitha,rajasekhar speech,rajasekhar controversial comments on chiranjeevi,#chiranjeevi,rajashekar,chiranjeevi rajasekhar,chiranjeevi vs rajasekhar,chiranjeevi about rajasekhar,tollywood,telugu cinema,రాజశేఖర్,చిరంజీవి,రాజశేఖర్ చిరంజీవి మధ్య విభేదాలు,మరోసారి గుప్పుమన్న విభేదాలు,సురేఖ,సురేఖ చిరంజీవి
భార్య సురేఖతో చిరంజీవి (Twitter/Photo)


పెళ్లి విషయంలో అపుడు పెద్ద హడావుడే జరిగింది. ఆ టైమ్‌లో నేను నూతన్‌ ప్రసాద్‌తో కలిసి ‘తాతయ్య ప్రేమలీలలు’ సినిమా చేస్తున్నా. అందులో నూతన్‌ ప్రసాద్‌కు నాకు కొన్ని కీలకమైన సన్నివేశాలున్నాయి. అప్పట్లో ఆయన బిజీ నటుడు కావడంతో ఆయన డేట్స్ కోసం పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వస్తుందేమో అనుకున్నాం. కానీ నిర్మాత మాత్రం వాయిదా వేసి మా పెళ్లి జరిగేలా చేసారు. ఇక పెళ్లి పీఠాలెక్కే సమయానికి నా చొక్కా చిరిగిపోయింది. అది చూసిన సురేఖ వెళ్లి బట్టలు మార్చుకొని రావచ్చుగా అని అడిగింది. బట్టలు చిరిగితే తాళి కట్టలేనా అని అలాగే మండపంలో చిరిగిన బట్టలతో తాళి కట్టి పెళ్లి తంతు ముగించేసాను అంటూ అలనాటి పెళ్లి జ్ఞాపకాలను తన భార్య సురేఖతో కలిసి చిరంజీవి పంచుకున్నారు.

First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు