అది కారవానా లేదా కాపురాలు చేసే వ్యానా.. చిరంజీవి, తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు వాడే కారవాన్‌లపై చిరంజీవి, తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇపుడీ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: March 12, 2020, 6:14 PM IST
అది కారవానా లేదా కాపురాలు చేసే వ్యానా.. చిరంజీవి, తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
చిరంజీవి తమ్మారెడ్డి భరద్వాజ్ (Twitter/tammareddy bharadwaj chiranjeevi)
  • Share this:
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు వాడే కారవాన్‌లపై చిరంజీవి, తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇపుడీ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. ఒకప్పటిలా ఇండస్ట్రీలో పరిస్థితులు లేవు. పూర్తిగా మారిపోయాయి. ప్రొడక్షన్ దగ్గర నుంచి టెక్నాలజీ వరకు అన్ని పూర్తిగా ఛేంజ్ అయ్యాయి. ఒకప్పుడు ఉన్న పరిస్థితి ఇండస్ట్రీలో ఇపుడు ఏది లేదు. ఒకప్పుడు ఆర్టిస్టులు ఎంతో డెడికేషన్‌తో పనిచేసేవారు. ఇపుడు అలా కాదు. పారితోషకం ఎంతిస్తున్నారు. నా క్యారెక్టర్ ఏంటి నా షూటింగ్ అయిపోయిందా లేదా అనేదే చూసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఎంత చిన్న హీరో అయిన కారవాన్లు వాడటం అనేది కామన్ అయిపోయింది. అయితే ఈ  కారవాన్ ‌లనేది హీరోలు, హీరోయిన్లు అవసరానికి మించి వాడుతున్నారని చిరంజీవి,తమ్మారెడ్డి భరద్వాజ్ వంటి వారు మండిపడుతున్నారు. ఓ సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ.. పదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చాను. ఇన్నేళ్లలో సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. నేను శంకర్ దాదా జిందాబాద్ చేస్తున్న సమయంలో మాకు కారవాన్‌లు లేవు. అప్పట్లో లేడీస్‌కు కారవాన్ ఉంటే బావుండేది అనుకున్నాను.  కారవాన్ ఉండటం అనేది మంచిదే కానీ.. అది కనీస అవసరాలకు మాత్రమే వాడుకుంటే బాగుంటుంది. ఒక వేళ కారవాన్‌లో కూర్చోన్న ఆర్టిస్ట్‌ను షూటింగ్‌కు పిలవడానికి అసిస్టెంట్ డైరెక్టర్ జీవితం అక్కడే అయిపోతుంది. అతనికి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో నేర్చుకోవడానికి ఏమి ఉండదు. ఈ విషయమై ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు రావాలన్నారు.

tammareddy bharadwaj sensational comments on chiranjeevi sye raa narasimha reddy,tammareddy bharadwaj,tammareddy,tammareddy bharadwaj youtube channel,tammareddy bharadwaj youtube, #TammareddyBharadwaj, #NaaAlochana, #SyeRaaNarasimhaReddy,sye raa narasimha reddy,tammareddy bharadwaj,tammareddy bharadwaj sensational comments on chiranjeevi,tammareddy bharadwaj naa alochana,tammareddy bharadwaj sensational comments on chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi facebook,sye raa narasimha reddy chiranjeevi,sye raa collections,tollywood,telugu cinema,తమ్మారెడ్డి భరద్వాజ,చిరంజీవి,తమ్మారెడ్డి భరద్వాజ చిరంజీవి,తమ్మారెడ్డి భరద్వాజ సెన్సేషనల్ కామెంట్స్,సైరా నరసింహారెడ్డి కలెక్షన్స్,సైరా కలెక్షన్స్ పై తమ్మారెడ్డి ఫైర్,
‘సైరా’ సినిమాపై తమ్మారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..


నేను మాత్రం కారవాన్ అనేది మేకప్ చేసుకోవడానికి.. బట్టలు మార్చుకోవడానికో, వాష్‌రూమ్ అంతే తప్పించి వేరే దానికి వాడను. షూటింగ్‌లో గ్యాప్ దొరికితే మాత్రం నేను లొకేషన్‌లో ఉంటాను. అలా ఉండటం వలన వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గా జరిగిపోతుంది. మనం వెళ్లి రిలాక్స్ అయితే మిగతావాళ్లు కూడా అలాగే రిలాక్స్ అయిపోతారు. ఆ ఎఫెక్ట్ సినిమా ఔట్‌పుట్ పై పడుతుంది. దీనితో పనిదినాలు పెరిగిపోతాయి. వర్క్ డేస్ పెరగడం వల్ల బడ్జెట్ కూడా అదుపు తప్పుతుందన్నారు. ప్రస్తుతం కారవాన్‌లనేది హీరోలకు ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయిందన్నారు. సెట్‌లో మిగతా చిన్న ఆర్టిస్టులతో వెళ్లి కూర్చోవాలంటే నామోషీగా ఫీలవుతున్నారు. హీరోలు, హీరోయిన్లు సెట్‌లో ఉంటే వర్క్ విషయలో డైరెక్టర్,కెమెరా మెన్ అందరు ఆనందంగా ఫీలవుతారు. సినిమాల్లో తక్కువ రోజుల్లో పూర్తి చేయవచ్చన్నారు.

chiranjeevi tammareddy bharadwaj sensational comments on caravan,కారవాన్ లేదా కాపురాలు చేసే వ్యానా.. చిరంజీవి, తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు,chiranjeevi,tammareddy baharadwaj,tammareddy baharadwaj comments on caravan,chiranjeevi comments on caravan,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi facebook,chiru,tollywood,telugu cinema,chiranjeevi tammareddy bharadwaj,చిరంజీవి,తమ్మారెడ్డి భరద్వాజ,చిరంజీవి తమ్మారెడ్డి భరద్వాజ,కారవాన్ తమ్మారెడ్డి భరద్వాజ చిరంజీవి,కారవాన్ ‌వ్యాన్ లపై చిరంజీవి తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు
చిరంజీవి తమ్మారెడ్డి భరద్వాజ్ (Twitter/Photo)


దీనిపై తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. చిరంజీవి చెప్పినట్లు కారవాన్‌లో వెళ్లి కూర్చొని.. పిలిచినపుడు వెళదాం అనే నిర్లక్ష్యంతోనే చాలా మంది హీరో, హీరోయిన్లు ఉన్నారు. ఒక అసిస్టెంట్ దర్శకుడు 20 ఏళ్ల వయసులో ఏదైనా నేర్చుకుందామని ఇండస్ట్రీకి వస్తాడు.అలాంటి వాళ్లు కారవాన్‌‌ల వల్ల హీరోలు, హీరోయిన్లను పిలవడానికే పరిమితమయ్యారు. వాళ్లు పిలిస్తే తొందరగా వీళ్లు బయటకు రారు. వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వస్తోంది. దీంతో వాళ్లు ఇండస్ట్రీలో ఏమి నేర్చుకోకుండానే వెనుదిరుగుతున్నారు. అందరు ఈ విషయాన్ని గమినిస్తే ఇండస్ట్రీలో కొత్త దర్శకులు వస్తారు. అలా ఇండస్ట్రీ కూడా బాగుపడుతోందన్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 12, 2020, 6:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading