ఆ సినిమా విషయంలో చిరంజీవి మనసు మార్చుకున్నారా..

చిరంజీవి (Chiranjeevi/Twitter)

చిరంజీవి ఆ సినిమా విషయంలో తన మనసు మార్చుకున్నాడా అంటే ఔననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. 

 • Share this:
  చిరంజీవి ఆ సినిమా విషయంలో తన మనసు మార్చుకున్నాడా అంటే ఔననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఈ  సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి.. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించి సూపర్ హిట్టైన ‘లూసిఫర్’ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ రైట్స్‌‌ను రామ్ చరణ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా కోసం ‘సాహో’ ఫేమ్ సుజిత్‌ను డైరెక్టర్‌గా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఈయన చిరంజీవిని సంతృప్తి పరిచేలా ఈ  సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయలేదట. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాను చేయకపోవడమే ఉత్తమం అనే నిర్ణయానికి చిరు వచ్చినట్టు వార్తులు వస్తున్నాయి.

  చిరంజీవి వినాయక్ (Chiranjeevi Vinayak Lucifer movie remake)
  చిరంజీవి వినాయక్ (Chiranjeevi Vinayak Lucifer movie remake)


  మరోవైపు సుజిత్ ఈ సినిమా కథలో  చేసిన మార్పులు చిరు నచ్చలేదని టాక్. దీంతో ఈ సినిమా నుంచి సుజిత్ తప్పించి లూసిఫర్ రీమేక్ దర్శకత్వ బాధ్యతలను వినాయక్‌కు అప్పగించబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ సినిమాను రీమేక్ చేయకపోవడమే ఉత్తమనే నిర్ణయానికి చిరు వచ్చినట్టు మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి.  మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిరంజీవి కానీ ఈ సినిమా  యూనిట్ కానీ స్పందిస్తే కానీ అసలు విషయం తెలియదు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: