Home /News /movies /

CHIRANJEEVI SYE RAA NARASIMHA REDDY WORLDWIDE CLOSING COLLECTIONS AND MEGASTAR ENDED UP WITH AVERAGE PK

‘సైరా నరసింహా రెడ్డి’ క్లోజింగ్ కలెక్షన్స్.. చిరంజీవికి అక్కడ నిరాశే..

సైరా నరసింహారెడ్డి (Source: Twitter)

సైరా నరసింహారెడ్డి (Source: Twitter)

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ విుడదలై ఇప్పటికే దాదాపు నెల రోజులు కావొస్తుంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్ర బిజినెస్ చాలా చోట్ల ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటికే 30 రోజులు..

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ విుడదలై ఇప్పటికే దాదాపు నెల రోజులు కావొస్తుంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్ర బిజినెస్ చాలా చోట్ల ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటికే 30 రోజులు గడిచిపోవడంతో ఫైనల్ కలెక్షన్స్ వచ్చేసాయి. అమ్మిన రేటు ప్రకారం చూస్తుంటే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదు ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో 106 కోట్ల మార్క్ షేర్‌ను అందుకుంది సైరా నరసింహారెడ్డి. పెరిగిన దసరా సెలవులు నైజాంలో ఈ సినిమాకు బాగానే ఉపయోగపడ్డాయి. మొత్తంగా 240 కోట్ల గ్రాస్.. రూ. 143 కోట్లు షేర్ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది సైరా.

Sye Raa Narasimha Reddy movie 19 days Worldwide collections and Chiranjeevi movie ended up as a flop pk రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’. ఇప్పటికే 19 రోజుల్లో ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టినా.. అమ్మిన రేటు ప్రకారం చూస్తుంటే చాలా.. sye raa,sye raa narasimha reddy,sye raa narasimha reddy world wide latest collections,sye raa narasimha reddy movie,sye raa narasimha reddy 19 days collections,sye raa narasimha reddy movie 19 days collections,sye raa narasimha reddy movie 19 days ww collections,sye raa narasimha reddy movie 19 days worldwide collections,sye raa narasimha reddy movie collections,sye raa narasimha reddy movie chiranjeevi,sye raa narasimha reddy collections,sye raa narasimha reddy movie ww collections,telugu cinema,సైరా నరసింహా రెడ్డి,సైరా కలెక్షన్స్,సైరా వరల్డ్ వైడ్ కలెక్షన్స్,సైరా 19 రోజుల కలెక్షన్స్,తెలుగు సినిమా
సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)


ఈ చిత్రాన్ని దాదాపు 188 కోట్లకు పైగానే నిర్మాతలు అమ్మినట్లు తెలుస్తుంది. తెలుగులో మాత్రమే సైరా మంచి వసూళ్లు సాధించింది. ఇక్కడ 106 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది. ఇక్కడా కూడా కొన్ని ఏరియాల్లో స్వల్ప నష్టాలను తీసుకొచ్చాడు చిరంజీవి. నైజాం, ఉత్తరాంధ్ర లాంటి ఒకట్రెండు చోట్ల మాత్రమే సైరా బ్రేక్ ఈవెన్ అయి లాభాలు తీసుకొచ్చింది. మిగిలిన చోట్ల నష్టాలు తప్పలేదు. ఇక మిగిలిన భాషల్లో అయితే ‘సైరా నరసింహారెడ్డి’ దారుణంగా నిరాశ పరిచింది. ఓవర్సీస్‌లో అయితే పరిస్థితి మరీ దారుణం. అక్కడ 2.5 మిలియన్ దగ్గరే ఆగిపోయింది ఈ చిత్రం.

Sye Raa Narasimha Reddy movie 19 days Worldwide collections and Chiranjeevi movie ended up as a flop pk రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’. ఇప్పటికే 19 రోజుల్లో ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టినా.. అమ్మిన రేటు ప్రకారం చూస్తుంటే చాలా.. sye raa,sye raa narasimha reddy,sye raa narasimha reddy world wide latest collections,sye raa narasimha reddy movie,sye raa narasimha reddy 19 days collections,sye raa narasimha reddy movie 19 days collections,sye raa narasimha reddy movie 19 days ww collections,sye raa narasimha reddy movie 19 days worldwide collections,sye raa narasimha reddy movie collections,sye raa narasimha reddy movie chiranjeevi,sye raa narasimha reddy collections,sye raa narasimha reddy movie ww collections,telugu cinema,సైరా నరసింహా రెడ్డి,సైరా కలెక్షన్స్,సైరా వరల్డ్ వైడ్ కలెక్షన్స్,సైరా 19 రోజుల కలెక్షన్స్,తెలుగు సినిమా
సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)


హిందీలో అయితే కనీస స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది ఈ చిత్రం. ఫుల్ రన్ కలిపితే కనీసం 8 కోట్లు కూడా తీసుకురాలేదు. అక్కడ వార్ సినిమా సైరాపై దారుణంగా దెబ్బేసింది. తెలుగులో కొన్నిచోట్ల మాత్రమే సైరా విజయం అందుకునేలా కనిపిస్తుంది. మిగిలిన చోట్ల మాత్రం చిరంజీవికి కాలం కలిసిరావడం లేదు. ఇప్పటి వరకు 143 కోట్లు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఇంకా చాలా వరకు వెనకబడి ఉంది ఈ చిత్రం. ఎటు చూసుకున్నా కూడా చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ కమర్షియల్‌గా నిరాశ పరిచిందనే చెప్పాలి.
First published:

Tags: Sye raa, Syeraa Narasimha Reddy, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు