‘సైరా నరసింహా రెడ్డి’ ట్రైలర్.. చిరంజీవి నట విశ్వరూపం.. ఎమోషనల్ జర్నీ..

వచ్చేసింది.. చిరంజీవి అభిమానులు ఎప్పట్నుంచో వేచి చూస్తున్న సమయం రానే వచ్చేసింది. సైరా కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. సైరా ట్రైలర్ ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 18, 2019, 5:49 PM IST
‘సైరా నరసింహా రెడ్డి’ ట్రైలర్.. చిరంజీవి నట విశ్వరూపం.. ఎమోషనల్ జర్నీ..
‘సైరా నరసింహారెడ్డి’ కొత్త పోస్టర్ (Twitter/Photo)
  • Share this:
వచ్చేసింది.. చిరంజీవి అభిమానులు ఎప్పట్నుంచో వేచి చూస్తున్న సమయం రానే వచ్చేసింది. సైరా కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. సైరా ట్రైలర్ ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. భారతమాతా కీ జై అంటూ మొదలైంది ఈ ట్రైలర్. ఖైదీ నెం 150 తర్వాత ఒకటి రెండు కాదు.. రెండున్నర ఏళ్లుగా సైరా కోసం కష్టపడుతూనే ఉన్నాడు చిరంజీవి. ఆయన లుక్ విడుదలైన క్షణం నుంచి కూడా ఈ చిత్రం కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. చిరు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా మొదలైంది. ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. రెండేళ్లుగా ఈ చిత్రం సెట్స్‌పైనే ఉంది.

Sye Raa Narasimha Reddy teaser released and Chiranjeevi excelled with a Stunning performance pk వచ్చేసింది.. చిరంజీవి అభిమానులు ఎప్పట్నుంచో వేచి చూస్తున్న సమయం రానే వచ్చేసింది. సైరా కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా పవన్ కళ్యాణ్ వాయిస్‌తో వచ్చిన టీజర్ రికార్డులకు తెరతీస్తుంది. sye raa,sye raa teaser,sye raa narasimha reddy,sye raa narasimha reddy teaser,sye raa narasimha reddy teaser released,Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy movie,ram charan facebook,konidela production company,konidela production company twitter,Sye Raa Narasimha Reddy twitter,Sye Raa Narasimha Reddy making video,Sye Raa Narasimha Reddy making,chiranjeevi Sye Raa Narasimha Reddy,megastar Sye Raa Narasimha Reddy,sye raa teaser,sye raa making video,Sye Raa Narasimha Reddy cast,Sye Raa Narasimha Reddy crew,nayanthara chiranjeevi,tamannaah Sye Raa Narasimha Reddy,chiranjeevi ram charan,ram charan rrr movie,telugu cinema,సైరా నరసింహా రెడ్డి,సైరా టీజర్,సైరా మేకింగ్ వీడియో,చిరంజీవి సైరా,చిరంజీవి రామ్ చరణ్,తెలుగు సినిమా
సైరా టీజర్ పోస్టర్ (Source: Twitter)

క్వాలిటీ పేరుతో సురేందర్ రెడ్డి కూడా సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. చివరికి చిరు చేతిలో అప్పుడప్పుడూ కాస్త చివాట్లు కూడా తిన్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఏదేమైనా చివరికి చిరు మెప్పు పొందాడు సురేందర్ రెడ్డి. ఈయన తెరకెక్కించిన సన్నివేశాలు కొన్ని చిరుకు బాగా నచ్చేసాయి. సైరా ఔట్ పుట్ చూసి ఫిదా అయిపోతున్నాడు మెగాస్టార్. ఇక ఇప్పుడు విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేర్చేసింది. ట్రైలర్ అంతా ఎమోషనల్ జర్నీగా తీర్చిదిద్దాడు సురేందర్ రెడ్డి. ముఖ్యంగా ఉయ్యాలవాడ జీవిత చరిత్రను మనసుకు హత్తుకునేలా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు దర్శకుడు.

Sye Raa Narasimha Reddy teaser released and Chiranjeevi excelled with a Stunning performance pk వచ్చేసింది.. చిరంజీవి అభిమానులు ఎప్పట్నుంచో వేచి చూస్తున్న సమయం రానే వచ్చేసింది. సైరా కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా పవన్ కళ్యాణ్ వాయిస్‌తో వచ్చిన టీజర్ రికార్డులకు తెరతీస్తుంది. sye raa,sye raa teaser,sye raa narasimha reddy,sye raa narasimha reddy teaser,sye raa narasimha reddy teaser released,Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy movie,ram charan facebook,konidela production company,konidela production company twitter,Sye Raa Narasimha Reddy twitter,Sye Raa Narasimha Reddy making video,Sye Raa Narasimha Reddy making,chiranjeevi Sye Raa Narasimha Reddy,megastar Sye Raa Narasimha Reddy,sye raa teaser,sye raa making video,Sye Raa Narasimha Reddy cast,Sye Raa Narasimha Reddy crew,nayanthara chiranjeevi,tamannaah Sye Raa Narasimha Reddy,chiranjeevi ram charan,ram charan rrr movie,telugu cinema,సైరా నరసింహా రెడ్డి,సైరా టీజర్,సైరా మేకింగ్ వీడియో,చిరంజీవి సైరా,చిరంజీవి రామ్ చరణ్,తెలుగు సినిమా
సైరా నరసింహా రెడ్డి (Source: Twitter)
సైరా మేకింగ్ వీడియో విడుదలకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వచ్చింది. టీజర్ కూడా అలాగే హైప్ తీసుకొచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కూడా మరో స్థాయిలో ఉండటంతో కచ్చితంగా సైరా సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు అభిమానులు. ట్రైలర్‌లో అందరూ కనిపించారు. ప్రతీ కారెక్టర్‌ను హైలైట్ చేసాడు దర్శకుడు. పైగా బిజినెస్ రేంజ్ కూడా మార్చేసింది ఈ చిత్రం. ఇక ఇప్పుడు ట్రైలర్ కూడా అంతే.. ఇది కూడా విజువల్ వండర్‌గానే వచ్చింది. ఇందులో కూడా చిరంజీవి లుక్ అదిరిపోయింది.

పూర్తిగా చిరు లుక్ ఇందులో రివీల్ చేసారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేసాడు మెగాస్టార్. ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేస్తున్నాడు.. ఇప్పుడు ఇంటర్వ్యూలకు కూడా సిద్ధమవుతున్నాడు. ఆ లోపే మేకింగ్, టీజర్ విడుదల చేసి సినిమాపై అంచనాలు మరింత పెంచేసారు చిత్రయూనిట్. ఇప్పుడు ట్రైలర్ కూడా సంచలనాలు రేపుతుంది. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని 250 కోట్లతో నిర్మిస్తున్నాడు. నయనతార, తమన్నా, జగపతిబాబు, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అక్టోబర్ 2న సినిమా విడుదల కానుందని తెలుస్తుంది.
First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>