చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి అనుకోని షాక్.. తలపట్టుకుంటున్న రామ్ చరణ్..

‘సైరా’ షూటింగ్ స్పాట్‌లో రామ్ చరణ్,చిరంజీవి ( Twitter/Photo)

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగానటించిన తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఎంతో భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తాజాగా ఈ చిత్రానికి అనుకోని షాక్ తగిలింది.

  • Share this:
    మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగానటించిన తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఎంతో భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ‘బాహుబలి’ తరహాలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ భారీ చారిత్రక చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. హిందీ సహా పలు భాషల్లో ఈ చిత్రం సరైన వసూళ్లను రాబట్టలేకపోయింది.హిందీలో కనీసం రూ.60 కోట్ల వస్తాయనుకున్నారు. కానీ రూ.5 కోట్లకే పరిమితమైంది. తాజాగా ఈ సినిమాకు జీఎస్టీ రూపంలో మరో షాక్ తగిలింది. ఇక స్వాతంత్య్ర సమరయోధుల కథల్ని తెరకెక్కించినపుడు ప్రభుత్వాలు నుంచి పన్ను మినహాయింపు ఉంటుంది. గతంలో తెరకెక్కిన  చాలా చారిత్రక చిత్రాలకు ఇలాంటి పన్ను మినహాయింపు ప్రభుత్వాల నుంచి లభించింది. ఇక చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు పన్ను మినహాయింపు ఉంటుందని మెగా ఫ్యామిలీ భావించింది. ఐతే.. ‘సైరా..నరసింహారెడ్డి’ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి పన్ను మినహాయింపు లభించలేదని టాక్. దీంతో చిత్ర నిర్మాత రామ్ చరణ్‌కు జీఎస్టీ రూపంలో రూ.20 కోట్ల వరకు పన్ను కట్టాల్సి వచ్చింది.  
    Published by:Kiran Kumar Thanjavur
    First published: