చిరంజీవి ‘సైరా నరసింహా రెడ్డి’ శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఎంతో తెలుసా..?

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తుంది. మరో 15 రోజుల్లోనే సినిమా విడుదల కానుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 17, 2019, 11:16 PM IST
చిరంజీవి ‘సైరా నరసింహా రెడ్డి’ శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఎంతో తెలుసా..?
సైరా పోస్టర్ (Source: Twitter)
  • Share this:
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తుంది. మరో 15 రోజుల్లోనే సినిమా విడుదల కానుంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ చిత్రం శాటిలైట్, డిజిటల్ రైట్స్‌లో సంచలనాలు రేపుతుంది. చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్.. ఆయనకు ఉన్న క్రేజ్ ఇప్పుడు సైరా విషయంలో మరోసారి నిరూపితమవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం భారతదేశ తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి.
Chiranjeevi Sye Raa Narasimha Reddy movie digital and satellite rights sold for a record price pk  మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తుంది. మరో 15 రోజుల్లోనే సినిమా విడుదల కానుంది. Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy movie,Sye Raa Narasimha Reddy trailer,chiranjeevi twitter,chiranjeevi instagram,sye raa trailer,Sye Raa digital and satellite rights,Sye Raa Narasimha Reddy digital rights,sye raa satellite rights,telugu cinema,సైరా,సైరా డిజిటల్ రైట్స్,సైరా శాటిలైట్ రైట్స్,తెలుగు సినిమా,సైరా నరసింహా రెడ్డి,
‘సైరా నరసింహారెడ్డి’ (Source: Twitter)

అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం సైరా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఏకంగా 125 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తుంది. జీ టీవీ ఈ చిత్ర శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను భారీ మొత్తానికి తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అంతేకాదు.. అమేజాన్ కూడా ఈ చిత్రాన్ని 40 కోట్లకు కొనుగోలు చేసారని తెలుస్తుంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ సెప్టెంబర్ 18న విడుదల కానుంది.
Chiranjeevi Sye Raa Narasimha Reddy movie digital and satellite rights sold for a record price pk  మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తుంది. మరో 15 రోజుల్లోనే సినిమా విడుదల కానుంది. Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy movie,Sye Raa Narasimha Reddy trailer,chiranjeevi twitter,chiranjeevi instagram,sye raa trailer,Sye Raa digital and satellite rights,Sye Raa Narasimha Reddy digital rights,sye raa satellite rights,telugu cinema,సైరా,సైరా డిజిటల్ రైట్స్,సైరా శాటిలైట్ రైట్స్,తెలుగు సినిమా,సైరా నరసింహా రెడ్డి,
సైరా పోస్టర్ (Source: Twitter)

తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 100 థియేటర్లలో సైరా ట్రైలర్ విడుదల కానుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22న జరగనుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి స్టార్స్ నటిస్తున్నారు. 250 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading