తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్స్ సృష్టిస్తున్న చిరంజీవి సైరా ప్రీ రిలీజ్ బిజినెస్...

Sye Raa : సైరా.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయేరీతిలో జరిగినట్లు సమాచారం.

news18-telugu
Updated: September 7, 2019, 7:39 PM IST
తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్స్ సృష్టిస్తున్న చిరంజీవి సైరా ప్రీ రిలీజ్ బిజినెస్...
Instagram/konidelapro
  • Share this:
Sye Raa  : మెగాస్టార్ చిరంజీవి... ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత నటిస్తోన్న పిరియాడిక్ చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. చిరంజీవి ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  పాత్రలో నటిస్తున్నాడు. సైరాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై దాదాపు రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాలో హిందీ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు, తెలుగు నటుడు జగపతిబాబు, కన్నడ నటుడు సుదీప్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, నయనతార ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అది అలా ఉంటే.. ఈసినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయేరీతిలో జరిగినట్లు సమాచారం. 

View this post on Instagram
 

This has been our labour of love. Presenting the #SyeRaaTeaser!#SyeRaaNarasimhaReddy @amitabhbachchan #MegastarChiranjeevi @AlwaysRamCharan #DirectorSurenderReddy #Nayanthara @KichchaSudeepa @actorvijaysethupathi @ravikishann @tamannaahspeaks @niharikakonidela @ameet_trivedi


A post shared by Ram Charan (@alwaysramcharan) on

సైరా నిర్మాత‌లు ఫ్యాన్సీ రేటుకు రెండు రాష్ట్రాలకు సంబందించిన థియేట్రిక‌ల్ రైట్స్‌ను అమ్మార‌ని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. తాజాగా అందుతున్న సమాచారం మేరకు నైజాం రైట్స్‌ను రూ.30కోట్లకు,  సీడెడ్‌లో సినిమా రైట్స్‌ను రూ.22 కోట్లకు, ఉత్త‌రాంధ్ర రూ.14.4 కోట్లకు, తూర్పు గోదావ‌రి రూ.10.5కోట్లు, ప‌శ్శిమ గోదావ‌రి రూ.8.4కోట్లు, కృష్ణా రూ.8.4 కోట్లు, గుంటూరు రూ.11.5కోట్లు, నెల్లూరు రూ.4.8కోట్లు, రూపాయల‌కు సైరా థియేట్రికల్ రైట్స్‌ను అమ్మారని తెలుస్తోంది. దీన్ని బట్టి సైరా సినిమాకు రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు రూ.110 కోట్ల బిజినెస్ జ‌రిగింద‌ని తెలుస్తోంది. ఇక్కడ విశేషమేమంటే.. ప్రభాస్ బాహుబ‌లి సినిమాలు మిన‌హాయించి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్య‌ధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా  చిరంజీవి 'సైరా న‌ర‌సింహారెడ్డి' నిలిచి రికార్డ్ సృష్టించిదని టాక్ వినిపిస్తోంది.
First published: September 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు