మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నటించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’.ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు.చిరంజీవి తన 41 కెరీర్లో ఒక హిస్టారికల్ క్యారెక్టర్ చేయడం ఇదే మొదటిసారి. అంతేకాదు చిరంజీవి నటించిన ఈ సినిమా ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళం,కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కావడం అనేది కూడా ఫస్ట్ టైమే అని చెప్పొచ్చు. ఈ చిత్ర సెన్సార్ కూడా పూర్తైంది. సెన్సార్ సర్టిఫికేట్ కూడా విడుదల చేసింది బోర్డ్. 2 గంటల 50 నిమిషాల 50 సెకన్ల నిడివితో విడుదల కానుంది సైరా నరసింహా రెడ్డి.
ఉయ్యాలవాడ జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అక్టోబర్ 2న విడుదల కానుంది సైరా. చిరంజీవి ఈ చిత్రంతో కచ్చితంగా సంచలనం సృష్టిస్తాడని.. మరోసారి చరిత్ర తిరగరాయడం ఖాయం అంటున్నారు సెన్సార్ సభ్యులు.ఈ సినిమాలో బ్రిటిష్ వాళ్లతో యుద్ద సన్నివేశాల్లో రక్తపాతం ఉండటంతో ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్టు తెలిపారు.
అంతేకాదు సెన్సార్ టాక్‌ను బట్టి... ఈ సినిమాలో ప్రేక్షకులను ఉద్విగ్నతకు గురిచేసే సన్నివేశాలు చాలా ఉన్నాయట. సురేందర్ రెడ్డి ఆయా సన్నివేశాలను ఎంతో చక్కగా తెరపై చిత్రీకరించనట్టు సమాచారం.
మరోవైపు కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రామ్ చరణ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కించాడని టాక్. అంతేకాదు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్,నయనతార,విజయ సేతుపతి, జగపతి బాబు,తమన్నాతో ప్రతి పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉందని సెన్సార్ టాక్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Censor Board, Chiranjeevi, Konidela Productions, Ram Charan, Surender reddy, Sye Raa Narasimha Reddy Movie Review, Sye raa narasimhareddy, Telugu Cinema, Tollywood