సక్సెస్‌ఫుల్‌గా రెండు వారాలు కంప్లీట్ చేసుకొని మూడో వారంలో అడుగుపెట్టింది చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’. ఇప్పటికే 17 రోజుల్లో ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టినా.. అమ్మినా రేటు ప్రకారం చాలా చోట్ల ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పటికే తెలుగులో రూ.100 కోట్ల మార్క్ షేర్‌ను అందుకుంది సైరా నరసింహారెడ్డి. దసరా సెలవులు నైజాంలో ఈ సినిమాకు బాగానే ఉపయోగపడ్డాయి. సెలవుల తర్వాత మాములు పనిదినాల్లో ఈ సినిమా అనుకున్న కలెక్షన్స్ రాబట్టం లేదు. 16వ రోజు ఈ సినిమా రూ.39 లక్షల షేర్ రాబట్టగా.. 17 వరోజు మాత్రం రూ.29 లక్షల వసూలు చేసింది. మొత్తంగా రూ.228 కోట్ల గ్రాస్.. రూ. 139 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా వసూళు చేసింది. రూ.170 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ దగ్గర రూ.41 కోట్లను రాబట్టాల్సి ఉంది. ఇపుడున్న పరిస్థితుల్లో ఇంత కలెక్ట్ చేయడం దాదాపు అసాధ్యం. ఒక్క తెలుగు తప్పించి మిగతా అన్ని భాషల్లో ‘సైరా నరసింహారెడ్డి’ కనీస స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.
తెలుగులో కొన్ని చోట్ల మాత్రమే సైరా విజయం అందుకునేలా కనిపిస్తుంది. మిగిలిన చోట్ల మాత్రం చిరంజీవికి కాలం కలిసిరావడం లేదు. ఇప్పటి వరకు రూ. 139 కోట్లు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో కూడా నైజాంతో పాటు ఉత్తరాంధ్ర, నెల్లూరులో మాత్రమే సేఫ్ అయింది ఈ చిత్రం. మిగిలిన చోట్ల బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. మొత్తానికి సైరాతో చిరు ప్రయాణం ఎక్కడ ఆగనుందో చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Chiranjeevi, Konidela Productions, Nayanthara, Ram Charan, Surender reddy, Sye raa narasimhareddy, Telugu Cinema, Tollywood