ప్రభాస్‌ను దాటేసిన చిరంజీవి.. అందులో బాహుబలి కంటే సైరా ఎక్కువ..

తెలుగు ఇండస్ట్రీ రేంజ్ పెరుగుతుంది అనేది కాదనలేని విషయం. ఇప్పుడు మన సినిమాల స్థాయి చూసి బాలీవుడ్ కూడా నోరెళ్లబెడుతుంది. అందులో భాగంగానే వరసగా వస్తున్న సినిమాలు మన స్టామినా తెలుపుతున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 16, 2019, 2:49 PM IST
ప్రభాస్‌ను దాటేసిన చిరంజీవి.. అందులో బాహుబలి కంటే సైరా ఎక్కువ..
సైరా బాహుబలి పోస్టర్స్ (Source: Twitter)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీ రేంజ్ పెరుగుతుంది అనేది కాదనలేని విషయం. ఇప్పుడు మన సినిమాల స్థాయి చూసి బాలీవుడ్ కూడా నోరెళ్లబెడుతుంది. అందులో భాగంగానే వరసగా వస్తున్న సినిమాలు మన స్టామినా తెలుపుతున్నాయి. బాహుబలితో మొదలైన జైత్రయాత్ర సాహో, సైరాతో కొనసాగుతున్నాయి. మరికొన్ని సినిమాలు కూడా తెలుగు ఇండస్ట్రీ రేంజ్ చూపిస్తున్నాయి. సాహో మన దగ్గర ఫ్లాప్ అయినా కూడా బాలీవుడ్‌లో మాత్రం హిట్ అయింది. ఇక ఇప్పుడు అందరి చూపులు సైరాపై ఉన్నాయి. ఇది కూడా బాహుబలి మాదిరే విజువల్ వండర్ కావడంతో ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందర్లోనూ కనిపిస్తుంది.
Chiranjeevi Sye Raa beats Prabhas Bahubali movie in visual effects shots and Surender Reddy used more than Rajamouli pk తెలుగు ఇండస్ట్రీ రేంజ్ పెరుగుతుంది అనేది కాదనలేని విషయం. ఇప్పుడు మన సినిమాల స్థాయి చూసి బాలీవుడ్ కూడా నోరెళ్లబెడుతుంది. అందులో భాగంగానే వరసగా వస్తున్న సినిమాలు మన స్టామినా తెలుపుతున్నాయి. sye raa,sye raa twitter,sye raa movie release date,sye raa chiranjeevi,sye raa bahubali,sye raa visual effects,sye raa vfx,bahubali vfx,telugu cinema,సైరా,సైరా నరసింహా రెడ్డి,సైరా బాహుబలి,చిరంజీవి ప్రభాస్,సైరా విజువల్ ఎఫెక్ట్స్,తెలుగు సినిమా
బాహుబలి పోస్టర్ Photo: Twitter

ఈ క్రమంలోనే ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటికి వచ్చింది. సైరాలో బాహుబలి కంటే ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా భారీగానే ఉన్నాయి. దీనికోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేసారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా హాలీవుడ్ రేంజ్‌లోనే తెరకెక్కించాడు. మరో 15 రోజుల్లో ఈ చిత్రం విడుదల కానుంది. విఎఫ్ఎక్స్ విషయంలో ఇప్పటి వరకు తెలుగు సినిమాకు రోల్ మోడల్‌ బాహుబలి. అయితే ఇప్పుడు సైరాలో దీనికంటే ఎక్కువ విఎఫ్ఎక్స్ షాట్స్ వాడుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Chiranjeevi Sye Raa beats Prabhas Bahubali movie in visual effects shots and Surender Reddy used more than Rajamouli pk తెలుగు ఇండస్ట్రీ రేంజ్ పెరుగుతుంది అనేది కాదనలేని విషయం. ఇప్పుడు మన సినిమాల స్థాయి చూసి బాలీవుడ్ కూడా నోరెళ్లబెడుతుంది. అందులో భాగంగానే వరసగా వస్తున్న సినిమాలు మన స్టామినా తెలుపుతున్నాయి. sye raa,sye raa twitter,sye raa movie release date,sye raa chiranjeevi,sye raa bahubali,sye raa visual effects,sye raa vfx,bahubali vfx,telugu cinema,సైరా,సైరా నరసింహా రెడ్డి,సైరా బాహుబలి,చిరంజీవి ప్రభాస్,సైరా విజువల్ ఎఫెక్ట్స్,తెలుగు సినిమా
సైరా బాహుబలి పోస్టర్స్ (Source: Twitter)

ఇందులో ఏకంగా 3500 విఎఫ్ఎక్స్ షాట్లు ఉన్నట్లు తెలిసింది. బాహుబలిలో కంటే ఇవి 1000 ఎక్కువ కావడం విశేషం. అయితే బాహుబలితో పోలిస్తే సైరా ఖర్చు మాత్రం తక్కువే. సైరా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం అక్షరాలా 45 కోట్లు ఖర్చు చేసారు. కానీ బాహుబలిలో దీనికంటే డబుల్ ఖర్చు చేసారు నిర్మాతలు. ఇక 2.0లో కూడా దీనికంటే చాలా ఎక్కువ ఖర్చు చేసారు. కానీ సైరాలో పరిమిత ఖర్చుతో పరిణతి చెందిన విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయంటున్నారు దర్శక నిర్మాతలు. మరి ఈ షాట్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి. అక్టోబర్ 2న సైరా నరసింహా రెడ్డి విడుదల కానుంది.
First published: September 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading