CHIRANJEEVI SV KRISHNA REDDY ACTED TOGETHER IN KIRATHAKUDU MOVIE TA
చిరంజీవి, ఎస్వీ కృష్ణారెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుసా..
చిరంజీవి, ఎస్వీ కృష్ణారెడ్డి (File/Photos)
తెలుగులో ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎక్కువ కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఈయన చిరంజీవితో కలిసి ఓ సినిమాలో కలిసి నటించారు. వివరాల్లోకి వెళితే..
తెలుగులో ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎక్కువ కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఈయన తెలుగులో కృష్ణ,బాలకృష్ణ, నాగార్జున వంటి అగ్ర హీరోలతో సినిమాలు తెరకెక్కించారు. కానీ చిరంజీవితో ఏ సినిమాను తెరకెక్కించలేకపోయారు. కానీ ఓ సినిమాలో మాత్రం చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి ..దర్శకుడిగానే కాకుండా నటుడిగా ‘ఉగాది’, అభిషేకం వంటి సినిమాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే కదా. గతేడాది బాలకృష్ణ హీరోగా నటించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో డైరెక్టర్ కమలకర కామేశ్వరరావు పాత్రలో కాసేపు క్యామియో పాత్రలో కనిపించారు. కానీ ఈయన అపుడెపుడో 34 ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కిరాతకుడు’ సినిమాలో విలన్ కన్నడ ప్రభాకర్‌కు అసిస్టెంట్ పాత్రలో నటించారు కృష్ణారెడ్డి. ఈ పాత్రలో ఈయన యాక్టింగ్ కూడా చిత్ర విచిత్రంగా ఉంటుంది.
కిరాతకుడులో విలన్ అసిస్టెంట్ పాత్రలో నటించిన ఎస్వీ కృష్ణారెడ్డి (Twitter/Photo)
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా సక్సెస్ కాలేదు. ఆ సంగతి పక్కన పెడితే.. మొత్తానికి తన దర్శకత్వంలో చిరంజీవి యాక్ట్ చేయకపోయినా.. ఆయన హీరోగా నటించిన చిత్రంలో ఎస్వీ కృష్ణారెడ్డి చిన్న పాత్రలో నటించడం విశేషం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.