హోమ్ /వార్తలు /movies /

Chiranjeevi - Sukumar : సుకుమార్ దర్శకత్వంలో నటించిన చిరంజీవి.. సుక్కుతో పిక్ షేర్ చేసిన మెగాస్టార్..

Chiranjeevi - Sukumar : సుకుమార్ దర్శకత్వంలో నటించిన చిరంజీవి.. సుక్కుతో పిక్ షేర్ చేసిన మెగాస్టార్..

Chiranjeevi - Sukumar : సుకుమార్ దర్శకత్వంలో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా సుక్కుతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 

Chiranjeevi - Sukumar : సుకుమార్ దర్శకత్వంలో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా సుక్కుతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 

Chiranjeevi - Sukumar : సుకుమార్ దర్శకత్వంలో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా సుక్కుతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 

  Chiranjeevi - Sukumar : సుకుమార్ దర్శకత్వంలో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా సుక్కుతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే..  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా షూటింగ్ కంప్లీటైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తొలిసారి పూర్తి స్థాయిలో తన తనయుడు రామ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో పాటు దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ (Lucifer) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

  ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God Father) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీటైంది.  దీంతో పాటు చిరంజీవి .. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు. దాంతో పాటు బాబీ సినిమా చేస్తున్నారు. ఇంకోవైపు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.

  దర్శకుడు సుకుమార్‌తో చిరంజీవి (Twitter/Photo)

  ఆ సంగతి పక్కన పెడితే.. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. తాజాగా చిరంజీవి ఓ కమర్షియల్ యాడ్‌లో యాక్ట్ చేయడానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో ఈయన థమ్స్ అప్, నవరత్న ఆయిల్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాలకు దూరంగా ఉన్నారు.ఇపుడు మళ్లీ సినిమాల్లో బిజీగా కావడంతో ఈయనతో కార్పోరేట్ కంపెనీలు యాడ్స్ చేయడానికి రెడీ అయ్యారు. తాజాగా ఈయన శుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  తాజాగా ఆ యాడ్‌లో నటించారు. ఈ ప్రచార చిత్రాన్ని సుకుమార్ డైరెక్టర్ చేశారు.

  ఈ సందర్భంగా సుకుమార్ ప్రతిభ గురించి అందరికీ తెలిసిందే కదా. ఆయన దర్శకత్వంలో సినిమా చేయకపోయినా.. ఓ యాడ్ కోసం వారి దర్శకత్వంలో నటించడం గొప్ప అనుభూతి అన్నారు. ఈ యాడ్ నిర్మించిన శుభగృహ రియల్ ఎస్టేట్ వారికి శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సుక్కుతో ఉన్న ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు.  ఈ యాడ్ ఈ శనివారం తెలుగు వారి కొత్త సంవత్సరాది రోజున విడుదల చేయనున్నారు.

  RRR 1st Week WW Collections : ఆర్ఆర్ఆర్ మొదటి వారం కలెక్షన్స్.. ఏడు రోజుల్లో రూ. 700 కోట్ల క్లబ్‌లో సెన్సేషన్..

  ఇప్పటికే రామ్ చరణ్ .. కే.విశ్వనాథ్‌తో కలిసి ఓ కమర్షియల్ యాడ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు 13 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి కమర్షియల్ యాడ్స్ విషయంలో దూకుడు పెంచాలనే నిర్ణయానికి వచ్చారు చిరంజీవి. రీసెంట్‌గా కరోనా నుంచి చిరంజీవి కోలుకోవడంతో ఆయన షూటింగ్‌‌లో ఉత్సాహాంగా పాల్గోంటున్నారు. దాంతో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన టిక్కెట్ రేట్స్ ఇష్యూపై  ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే కదా.

  First published:

  ఉత్తమ కథలు