ఆ విషయంలో చిరంజీవి దిక్కు అంటున్న రజినీకాంత్..

Rajinikanth Chiranjeevi | గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని రజినీకాంత్‌కు ఇపుడు చిరంజీవి పెద్ద దిక్కులా మారాడు. అందుకే రజినీకాంత్ తన చేస్తోన్న కొత్త చిత్రానికి చిరంజీవి సాయం తీసుకోవాలనే నిర్ణయానికివచ్చినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: February 25, 2020, 8:00 PM IST
ఆ విషయంలో చిరంజీవి దిక్కు అంటున్న రజినీకాంత్..
చిరంజీవి రజినీకాంత్ (Source: Twitter)
  • Share this:
గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని రజినీకాంత్‌కు ఇపుడు చిరంజీవి పెద్ద దిక్కులా మారాడు. అందుకే రజినీకాంత్ తన చేస్తోన్న కొత్త చిత్రానికి చిరంజీవి సాయం తీసుకోవాలనే నిర్ణయానికివచ్చినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాత సూపర్ హిట్ సినిమా టైటిల్స్‌ను కొత్త సినిమాలకు పెట్టడం వెరీ కామన్. హిట్ సినిమా టైటిల్స్‌ రిపీటైతే.. ఆడియన్స్ కూడా ఆయా సినిమాలను చూడాలనే ఆసక్తి  ప్రదర్శిస్తుంటారు. అది కాకుండా పెద్ద స్టార్ హీరో సినిమా టైటిల్ పెట్టుకుంటే సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందనే కారణంతో ఆ ఫార్ములాను గుడ్డిగా ఫాలో అవుతుంటారు. మెగాస్టార్ పాత సినిమా టైటిల్స్‌ ‘ఖైదీ’తో సూపర్ హిట్ అందుకున్నాడు. టైటిల్‌‌ మహత్యంతో  పాటు కథ కూడా ఇంట్రెస్టింగ్‌గా వుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఒకప్పుడు చిరంజీవికి స్టార్ హీరో ఇమేజ్ తీసుకొచ్చిన ‘ఖైదీ’లాగే కార్తికి ఈ సినిమా ఊపిరి పోసింది. ఆ తర్వాత తన నెక్ట్స్ మూవీకి చిరు.. పాత సినిమా టైటిల్ ‘దొంగ’ టైటిల్ పెట్టుకున్న అంతగా కలిసిరాలేదు. అటు బెల్లంకొండ శ్రీనివాస్.. చిరంజీవి పాత సూపర్ హిట్ రాక్షసుడు టైటిల్‌తో మంచి సక్సెస్ అందుకున్నాడు. అటు నాని కూడా చిరంజీవి పాత సూపర్ హిట్ టైటిల్ ‘గ్యాంగ్ లీడర్’తో పలకరించాడు. తాజాగా రజినీకాంత్.. ప్రస్తుతం శివ దర్శకత్వంలో చేస్తోన్న చిత్రానికి చిరంజీవి పాత హిట్ మూవీ ‘అన్నయ్య’ టైటిల్‌ను తెలుగులో పెట్టాలని ఫిక్స్ అయ్యారట.

చిరంజీవితో రజినీకాంత్ (యూట్యూబ్ క్రెడిట్)


ఇప్పటికే తమిళంలో ఈ చిత్రానికి ‘అన్నతే’ అనే టైటిల్ ఖరారు చేసారు. దానినే తెలుగులో అర్ధం అన్నయ్య. అందుకే ఈ టైటిల్ పెట్టాలని దర్శకుడు శివతో పాటు రజినీకాంత్ దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఈ టైటిల్ విషయమై రజినీకాంత్ చిరంజీవిని సంప్రదించాడట. 2000లో విడులైన ‘అన్నయ్య’ చిత్రాన్ని చిరు తోడల్లుడు డా.కే.వేంకటేశ్వరరావు నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పకుడుగా వ్యవహరించారు. మొత్తానికి వరుస ఫ్లాపుల్లో ఉన్న రజినీకాంత్‌కు చిరంజీవి టైటిల్‌ అన్నయ్య మహిమతోనైనా హిట్టు అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

.
Published by: Kiran Kumar Thanjavur
First published: February 25, 2020, 8:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading