తెలుగు చిత్ర సీమలో చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించిన జగదేక వీరుడు అతిలోకసుందరి సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ మధ్యనే ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తి అయింది. అందులో వైజయంతి మూవీస్ బ్యానర్లో సి.అశ్వనీదత్ నిర్మాతగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. శ్రీనివాస చక్రవర్తి అందించిన కథకు జంధ్యాల మాటలు, వేటూరి పాటలు, బాలూ గాత్రం, ఇళయరాజా సంగీతం ఈ సినిమా విజయంలో కీ రోల్ పోషించాయి. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న అన్నిరికార్డులను తిరగరాసింది. అంతేకాదు హైదరాబాద్‌లోని ‘ఓడియన్ 70 MM’ థియేటర్లో ఏకధాటిగా ఒక యేడాది పాటు నాల్గోషోలతో రఫ్పాడించింది. ఈ సినిమాలో జగదేకవీరుడుగా చిరంజీవి నటనతో పాటు ఇంద్రుడి కుమార్తె అతిలోకసుందరి ఇంద్రజగా శ్రీదేవిని తప్పించి మరోకరిని ఊహించుకోలేము.
ఐతే ఈ సినిమా కోసం అప్పట్లో అశ్వనీదత్.. చిరంజీవికి రూ. 35 లక్షల పారితోషకం ఇచ్చారు. అటు శ్రీదేవికి రూ. 25 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. అప్పట్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 5 రూపాయలు బాల్కనీ టికెట్ ఉన్న రోజుల్లోనే రూ. 7 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి రూ. కోటి వరకు పెంచారు. అప్పట్లో మన దేశంలో ఏ హీరో కూడా అంత పారితోషకం అందుకోలేదు. ఇది కూడా ఓ రికార్డు. ఈ సినిమా తర్వాత వీళ్లిద్దరు కలిసి ‘ఎస్పీ పరశురామ్’ సినిమాలో కలిసి నటించారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aswani Dutt, Chiranjeevi, K. Raghavendra Rao, Sridevi, Tollywood, Vyjayanthi Movies