హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi - Sreemukhi: గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్‌లో చిరంజీవిని అంత మాట అన్న శ్రీముఖి.. వీడియో వైరల్..

Chiranjeevi - Sreemukhi: గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్‌లో చిరంజీవిని అంత మాట అన్న శ్రీముఖి.. వీడియో వైరల్..

చిరంజీవిని అంత మాట అన్న శ్రీముఖి (Twitter/Photo)

చిరంజీవిని అంత మాట అన్న శ్రీముఖి (Twitter/Photo)

Chiranjeevi -Sreemukhi - God Father Promotions :  మెగాస్టార్  చిరంజీవి  మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ (Lucifer) రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Chiranjeevi -Sreemukhi - God Father Promotions :  మెగాస్టార్  చిరంజీవి  మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ (Lucifer) రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ (God Father )టైటిల్‌గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌తో పాటు తాజాగా విడుదల చేసిన ‘తార్ మార్ తక్కర్ మార్’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో  బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను సల్మాన్ చేసారు. ఈ సినిమాను మలయాళం తప్ప మిగిలిన కన్నడ, తమిళ్, హిందీలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు.

‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్, చిరంజీవి  స్పెషల్ సాంగ్‌ ఉంది.  ఈ సాంగ్‌ ప్రోమోను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా చిరంజీవి.. ఓ ప్రైవేటు జెట్‌లో టాలీవుడ్ హాట్ యాంకర్ శ్రీముఖికి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా చిరును ఇంటర్వ్యూ చేస్తూ శ్రీముఖి చేసిన ఇంటర్వ్యూలో చిరంజీవి చూసి అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రోమోలో శ్రీముఖి మాట్లాడుతూ.. మీరు చెప్పిన పొలిటికల్  డైలాగులు మాములు సంచలనం సృష్టించలేదు అంటే. చిరంజీవి మాట్లాడుతూ..  రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు అన్న డైలాగు చెప్పిన తర్వాత.. చిరును చూసి శ్రీముఖి.. ఐ లవ్యూ చిరంజీవి గారు.. ఈ లుక్‌లో మీరు చాలా హాట్‌గా ఉన్నారని శ్రీముఖి చెప్పిన డైలాగుకు చిరంజీవి కాస్త గొంతు సవరించుకొని ఇక చాలు అన్నట్లు ముఖం పెట్టినా.. శ్రీముఖి ఎక్కడా తగ్గకుండా.. మిమ్మల్ని చూసి తట్టుకోలేపోతున్నాను అనే డైలాగు చెప్పే సరికి అవాక్కవ్వడం చిరు వంతైంది.

ఈ సినిమాలో హీరోయిన్ లేదనే విషయం కానీ.. పాటలు లేవనే విషయం కానీ.. ప్రేక్షకుల ఆలోచనలకు రాకుండా చేసే సినిమానే ‘గాడ్ ఫాదర్’. వెయిట్ ఫర్ మై కమాండ్.. అంటూ ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ అడిగిన వెంటనే చేయడానికి ఒప్పుకున్నారు. ఆయనకు హాట్సాఫ్ అంటూ చెప్పుకొచ్చారు. పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో జర్నిలిస్ట్ పాత్రలో నటించారు. ఈ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాములుగా ఉండదన్నారు. మొత్తంగా  గాడ్ ఫాదర్ మూవీ నిశ్శబ్ధ విస్పోటనం అంటూ చిరంజీవి చెప్పిన డైలాగులతో ఈ ప్రోమో ముగిసింది. పూర్తి ఇంటర్వ్యూ త్వరలోనే విడుదల చేయనున్నారు. మొత్తంగా ఈ ప్రోమోలనే సినిమాకు సంబంధించిన చాలా విషయాలను ప్రస్తావించారు. ఇక శ్రీముఖి త్వరలో చిరంజీవితో కలిసి ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తోంది.

Krishna Vrinda Vihari Movie Review: ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ రివ్యూ.. అక్కడక్కడ ఆకట్టుకుంటుంది..

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓవరాల్‌గా రెండు భాషల్లో కలిపి రూ. 90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు సమాచారం. మరోవైపు డిజిటల్ రైట్స్ (హిందీ+ తెలుగు) కలిపి రూ. 57 కోట్లకు అమ్మడుపోయింది. మరోవైపు శాటిలైట్ రైట్స్ + ఆడియో రైట్స్ (తెలుగు+ హిందీ) కలిపి రూ. 60 కోట్లు.. ఓవరాల్‌గా రూ. 207 కోట్లు బిజినెస్ చేసింది. మొత్తంగా రీమేక్ మూవీకి ఈ రేంజ్‌లో బిజినెస్ జరిగింది అంటే అది మెగాస్టార్ రేంజ్ అని చెబుతున్నారు.

First published:

Tags: Chiranjeevi, Sreemukhi, Tollywood

ఉత్తమ కథలు