గ’గన్‘ నారంగ్‌తో చిరంజీవి.. సైరాకు ఒలంపిక్ షూటర్ సాయం..

చిరంజీవికి ఇప్పుడు సైరా త‌ప్ప మ‌రో ఆలోచ‌న అయితే లేదు. ఈ చిత్రాన్ని ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ చేయ‌డం ఒక్క‌టే ఇప్పుడు ఆయ‌న ముందున్న ల‌క్ష్యం. ఇక ఇప్పుడు ఈ చిత్రం కోసం ఒలంపిక్ షూటర్ గగన్ నారంగ్‌తో శిక్షణ తీసుకుంటున్నాడు చిరంజీవి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 1, 2018, 4:05 PM IST
గ’గన్‘ నారంగ్‌తో చిరంజీవి.. సైరాకు ఒలంపిక్ షూటర్ సాయం..
గగన్ నారంగ్‌తో చిరంజీవి
  • Share this:
చిరంజీవికి ఇప్పుడు "సైరా" త‌ప్ప మ‌రో ఆలోచ‌న అయితే లేదు. ప‌డుకున్నా లేచినా.. ఎక్క‌డ ఉన్నా కూడా ఇప్పుడు సైరా గురించే ఆలోచిస్తున్నాడు మెగాస్టార్. ఈ చిత్రాన్ని ఎలాగైనా బ్లాక్‌బ‌స్ట‌ర్ చేయ‌డం ఒక్క‌టే ఇప్పుడు ఆయ‌న ముందున్న ల‌క్ష్యం. దానికోస‌మే క‌ష్ట‌ప‌డుతున్నాడు. వ‌య‌సును కూడా ప‌ట్టించుకోకుండా "సైరా" కోసం పాటు ప‌డుతున్నాడు చిరంజీవి. జార్జియా షెడ్యూల్ త‌ర్వాత ప్ర‌స్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు చిరు.

Chiranjeevi Special training Under Olympic Shooter Gagan Narang.. చిరంజీవికి ఇప్పుడు సైరా త‌ప్ప మ‌రో ఆలోచ‌న అయితే లేదు. ఈ చిత్రాన్ని ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ చేయ‌డం ఒక్క‌టే ఇప్పుడు ఆయ‌న ముందున్న ల‌క్ష్యం. ఇక ఇప్పుడు ఈ చిత్రం కోసం ఒలంపిక్ షూటర్ గగన్ నారంగ్‌తో శిక్షణ తీసుకుంటున్నాడు చిరంజీవి. Chiranjeevi,megastar chiranjeevi,chiranjeevi gagan narang, chiranjeevi trained by gagan narang for syeraa,syeraa narasimhareddy,Olympic Shooter Gagan Narang,Gagan Narang,syeraa,సైరా నరసింహారెడ్డి,చిరంజీవి,గగన్ నారంగ్‌తో చిరంజీవి శిక్షణ,ఒలంపిక్ షూటర్ గగన్ నారంగ్‌తో చిరంజీవి,సైరా జార్జియా షెడ్యూల్,సురేందర్ రెడ్డి,గన్ షూటింగ్
‘సైరా నరసింహారెడ్డి’ మూవీ పోస్టర్

త‌ర్వాతి షెడ్యూల్ హైద‌రాబాద్‌లోనే జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డే భారీ షెడ్యూల్ కు ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఖాళీ టైమ్లో కూడా సినిమా గురించే క‌ష్ట‌ప‌డుతున్నాడు చిరంజీవి. ఒలంపిక్ షూటర్ గ‌గ‌న్ నారంగ్‌ను ప్ర‌త్యేకంగా ఇంటికి పిలిపించుకుని ఇక్క‌డే గ‌న్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. "సైరా"లో 200 ఏళ్ల నాటి నాటు తుపాకులు వాడుకుంటున్నారు. వాటిని వాడాలంటే అందులో మెల‌కువ‌లు తెలిసిన వాళ్లైతేనే వాడ‌గ‌ల‌రు. అందుకే షూటింగ్ ప్రాక్టీస్ కోసం గ‌గ‌న్ సాయం తీసుకుంటున్నాడు చిరంజీవి. ఈయ‌న 2012 లండ‌న్ ఒలంపిక్స్‌లో ఇండియాకు కాంస్య ప‌థ‌కం తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈయ‌న ద‌గ్గ‌ర షూట్‌లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు మెగాస్టార్.

Chiranjeevi Special training Under Olympic Shooter Gagan Narang.. చిరంజీవికి ఇప్పుడు సైరా త‌ప్ప మ‌రో ఆలోచ‌న అయితే లేదు. ఈ చిత్రాన్ని ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ చేయ‌డం ఒక్క‌టే ఇప్పుడు ఆయ‌న ముందున్న ల‌క్ష్యం. ఇక ఇప్పుడు ఈ చిత్రం కోసం ఒలంపిక్ షూటర్ గగన్ నారంగ్‌తో శిక్షణ తీసుకుంటున్నాడు చిరంజీవి. Chiranjeevi,megastar chiranjeevi,chiranjeevi gagan narang, chiranjeevi trained by gagan narang for syeraa,syeraa narasimhareddy,Olympic Shooter Gagan Narang,Gagan Narang,syeraa,సైరా నరసింహారెడ్డి,చిరంజీవి,గగన్ నారంగ్‌తో చిరంజీవి శిక్షణ,ఒలంపిక్ షూటర్ గగన్ నారంగ్‌తో చిరంజీవి,సైరా జార్జియా షెడ్యూల్,సురేందర్ రెడ్డి,గన్ షూటింగ్
సైరా నరసింహారెడ్డి మూవీ పోస్టర్
త‌ర్వాతి షెడ్యూల్ మొద‌ల‌య్యే స‌మ‌యానికి షూటింగ్‌లో ఆరితేరిపోవాల‌ని చూస్తున్నాడు అన్న‌య్య‌. ఈ కొత్త షెడ్యూల్ కూడా నెల రోజులకు పైగానే జ‌ర‌గ‌నుంది. దాంతో సైరా టాకీ దాదాపు పూర్తైపోయిన‌ట్లే. అన్నీ కుదిర్తే ఫిబ్ర‌వ‌రిలోపే షూటింగ్ అంతా పూర్తి చేయాలని చూస్తున్నాడు సురేంద‌ర్ రెడ్డి. ఎందుకంటే విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఎక్కువ‌గా ఉండ‌టంతో ఆర్నెళ్ల వ‌ర‌కు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌కే తీసుకోవాల‌ని చూస్తున్నాడు ద‌ర్శ‌కుడు. మొత్తానికి ఈ చిత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల కానుంది. ఏదేమైనా ఈ వ‌య‌సులో కూడా "సైరా" కోసం చిరు క‌ష్ట‌ప‌డుతున్న తీరు చూసి అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ కూడా షాక్ అయిపోతుంది.
First published: November 1, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>