చిరంజీవి చిన్నల్లుడికి కరోనా టెస్ట్.. రిజల్ట్ ఏమొచ్చిందంటే..

Kalyaan Dhev: కరోనా వైరస్ ప్రస్తుతం ఎలా విజృంభిస్తుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన వ్యక్తి కరోనాను అంటించుకోకుండా వస్తే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 12, 2020, 9:00 PM IST
చిరంజీవి చిన్నల్లుడికి కరోనా టెస్ట్.. రిజల్ట్ ఏమొచ్చిందంటే..
భార్య శ్రీజతో కళ్యాణ్ దేవ్ (Kalyaan dhev)
  • Share this:
కరోనా వైరస్ ప్రస్తుతం ఎలా విజృంభిస్తుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన వ్యక్తి కరోనాను అంటించుకోకుండా వస్తే అదే పదివేలు అంటున్నారు జనం కూడా. కరోనా ఈ స్థాయిలో ఉంది కాబట్టే సినిమా వాళ్లు కూడా అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. స్టార్స్ అయితే ఒక్కరు కూడా బయటికి రాలేదు. షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చినా కూడా ఇంట్లోనే ఉండిపోయారు. కానీ మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్‌ మాత్రం షూటింగ్ చేసొచ్చాడు.
కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి పోస్టర్ (super machi kalyaan dhev)
కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి పోస్టర్ (super machi kalyaan dhev)


అనుమతి వచ్చిన తర్వాత ఆయన నటిస్తున్న సూపర్ మచ్చి సినిమా షూటింగ్ చేసాడు కళ్యాణ్. టాలీవుడ్‌లో జరిగిన ఒకట్రెండు సినిమా షూటింగ్స్‌లో ఇది కూడా ఒకటి. విజేత తర్వాత ఈయన నటిస్తున్న సినిమా ఇదే. అయితే షూటింగ్‌కు వెళ్లొచ్చిన తర్వాత ఈయన వెంటనే స్వయంగా వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. ఇంట్లో భార్యా పిల్లలు ఉండటంతో ముందు వెళ్లి టెస్టులు చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చానని చెప్పాడు ఈయన. తనకు కరోనా టెస్టుల్లో నెగటివ్ అని తేలిందని ఇన్‌స్టాలో పోస్ట్ చేసాడు ఈయన.

అనంతరం ఇంటికి వచ్చి భార్య, పిల్లలను కలుసుకున్న కళ్యాణ్ దేవ్.. ఆ ఆనంద క్షణాలను సెల్ఫీలో బంధించి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసాడు. షూటింగ్‌ నుంచి వచ్చిన తర్వాత పూర్తిగా సెల్ప్‌-ఐసొలేషన్‌లోనే ఉంటూ వచ్చానని చెప్పుకొచ్చాడు కళ్యాణ్ దేవ్. తన గురించి శ్రద్ధ చూపించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌ చెప్పుకున్నాడు ఈ మెగా అల్లుడు. నిజంగా మీ ప్రేమను పొందడం అదృష్టంగా భావిస్తున్నా.. ఈ బృందాన్ని కౌగలించుకోవడం కోసం ఎదురుచూస్తూ వచ్చానంటూ రాసుకొచ్చాడు కళ్యాణ్ దేవ్. పులి వాసు తెరకెక్కిస్తున్న సూపర్ మచ్చిలో కన్నడ హీరోయిన్ రచితా రామ్ నటిస్తుంది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం వస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: July 12, 2020, 9:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading