Home /News /movies /

CHIRANJEEVI SHAYARI IN KRISHNA VAMSI RANGAMARTHANDA MOVIE SLB

Chiranjeevi: చిరంజీవి షాయరీ.. ఇంతకీ ఏంటది? మెగాస్టార్ ఎందుకలా..?

Photo Twitter

Photo Twitter

Chiranjeevi Voice Over: ఇటు సినిమాల్లో బిజీగా ఉంటూనే ఇతర చిత్రాల ప్రచారంలో కూడా తనవంతు పాత్ర పోషిస్తున్నారు చిరు. ఈ క్రమంలోనే ‘రంగమార్తాండ’ (Rangamarthanda) సినిమా కోసం ఆయన ముందుకొచ్చారు.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు సినిమాలు ఓకే చేశారు. ఈ సినిమాలన్నీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇటు సినిమాల్లో బిజీగా ఉంటూనే ఇతర చిత్రాల ప్రచారంలో కూడా తనవంతు పాత్ర పోషిస్తున్నారు చిరు. ఈ క్రమంలోనే ‘రంగమార్తాండ’ (Rangamarthanda) సినిమా కోసం ముందుకొచ్చారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamshy) దర్శకత్వంలో మరాఠీ సూపర్ హిట్ ‘నట సమ్రాట్’ (Nata samrat) తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రంగంలోకి దిగుతున్నారట చిరంజీవి. తన కెరీర్ లోనే మొట్టమొదటి సారిగా షాయరీ (Shayari) వినిపించబోతున్నారట.

మరాఠీ సూపర్ హిట్ ‘నటసమ్రాట్’ సినిమాను డైరెక్టర్ కృష్ణవంశీ తనదైన శైలిలో తెలుగు నేటివిటీకి అనుగుణంగా మలుస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్ (Prakashraj) ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లోనే విడుదల కానుంది. అయితే తెలుగు ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా నెరేటివ్ స్టైల్లో ఈ సినిమాను తెరపై ఆవిష్కరించబోతున్నారట కృష్ణవంశీ. ఇందుకోసం మొదటి సారి షాయరీ వాయిస్ తో తెలుగు ప్రేక్షకులకు కిక్కవ్వనున్నారట చిరంజీవి.

షాయరీ వాయిస్ అంటే రెగ్యులర్ వాయిస్ ఓవర్ కు చాలా భిన్నమైనది. సినిమాలోని ఎమోషన్‌ను బలంగా క్యారీ చేయడానికి ఈ షాయరీ ఎంతో ఉపయోగపడుతుంది. షాయరీ అనేది ఒక డైలాగ్ కాదు, ఒక పాట కాదు.. అదొక అందమైన పొయటిక్ ఎక్స్‌ప్రెషన్. అయితే ఇందుకు చిరంజీవి వాయిస్ అయితేనే బెటర్ అని భావించిన కృష్ణవంశీ ఆ విషయాన్ని చిరు వద్దకు తీసుకెళ్లి ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నారట. చిరంజీవి షాయరీతో ప్రేక్షకుల హృదయాల్ని ఎమోషనల్ గా టచ్ చేయొచ్చన్నది కృష్ణవంశీ ఆలోచన అన్నట్లుగా తెలుస్తోంది. ఇళయరాజా నేపథ్య సంగీతంలో చిరంజీవి షాయరీ ఈ సినిమాలో మేజర్ అట్రాక్షన్ అవుతుందని టాక్.

ఇకపోతే వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి.. గాడ్‌ఫాదర్ (Godfather) సినిమాతో ఈ సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమాతో వచ్చే సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. దీంతో పాటు భోళాశంకర్ (Bhola Shankar) మూవీతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. వీటితో పాటు మరికొన్ని సినిమాల్ని లైన్ లో పెడుతున్నారు చిరంజీవి. ఇలా ఈ వయసులో తన సినిమాలతో పాటు ఇతర సినిమాల్లో భాగమవుతూ తన మార్క్ వేసుకోవడం అనేది ఒక్క మెగాస్టార్ కే చెల్లుతుందేమో!.
Published by:Sunil Boddula
First published:

Tags: Chiranjeevi, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు