Home /News /movies /

CHIRANJEEVI SHANKAR DADA MBBS CHILD ARTIST BECOMES HERO NOW AND SIGNING FILMS PK

Shankar Dada MBBS: శంకర్‌ దాదాలో ఈ బుడ్డోడు ఇప్పుడు రకుల్‌తో రొమాన్స్ చేసాడు తెలుసా..?

శంకర్ దాదా చైల్డ్ ఆర్టిస్ట్ (Shankar Dada MBBS)

శంకర్ దాదా చైల్డ్ ఆర్టిస్ట్ (Shankar Dada MBBS)

Shankar Dada MBBS: శంకర్‌ దాదా MBBS సినిమా చూసిన వాళ్లకు ఈ కుర్రాడితో పెద్దగా పరిచయాలు అవసరం లేదు. సినిమా కథను మార్చే క్రమంలో అతి కీలకమైన పాత్ర ఇది. డైలాగులు ఉండవు కానీ సినిమాలో చాలా వరకు ఈ కారెక్టర్ ఉంటుంది.

శంకర్‌ దాదా MBBS సినిమా చూసిన వాళ్లకు ఈ కుర్రాడితో పెద్దగా పరిచయాలు అవసరం లేదు. సినిమా కథను మార్చే క్రమంలో అతి కీలకమైన పాత్ర ఇది. డైలాగులు ఉండవు కానీ సినిమాలో చాలా వరకు ఈ కారెక్టర్ ఉంటుంది. శ్రీ రామచంద్రమూర్తి అంటూ అందమైన పేరుతో.. అంతకంటే ముద్దుగా ఉండే మొహంతో అందర్నీ ఆకట్టుకున్నాడు ఈ బుడ్డోడు. అయితే అప్పట్లో ఈ కుర్రాడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ అనుకున్నారే కానీ ఈయన మెగా కుర్రాడే అని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు. ఇంతకీ ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా..? ఇప్పుడు ఈ బుడ్డోడే హీరో అయిపోయాడు.. అతనెవరో కాదు మెగా చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు. ప్రస్తుతం ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు వైష్ణవ్. అప్పట్లో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో మామయ్యతో కలిసి నటించాడు ఈ బుడ్డోడు. సబ్జెక్టుగా పరిచయమై.. శ్రీ రామచంద్రమూర్తిగా ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు వైష్ణవ్. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తన రెండో సినిమా చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తైపోయింది. త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఇప్పుడు చెప్తుంటే అర్థం అవుతుంది కానీ శంకర్ దాదాలో ఉన్నది ఈ కుర్రాడే అని చాలా మందికి తెలియదు.
వైష్ణవ్ తేజ్ శంకర్ దాదా MBBS (vaishnav tej in shankar dada mbbs)
వైష్ణవ్ తేజ్ శంకర్ దాదా MBBS (vaishnav tej in shankar dada mbbs)


ఇప్పుడు తెలిసిన తర్వాత అంతా ఇతనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మెగా కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరో ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డాడు. వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ స్టార్ అయ్యాడు. ఈయన వరస విజయాలతో రచ్చ చేస్తున్నాడు. ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ అంటూ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోవైపు వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెన నెట్ ఫ్లిక్స్‌లో విడుదల కాబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా మెగా మేనల్లుడి చిన్నప్పటి ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Chiranjeevi, Telugu Cinema, Tollywood, Vaishnav tej

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు