Home /News /movies /

CHIRANJEEVI SENSATIONAL DESICION ON SANKRANTHI FESTIVAL HIS SAY S IN FUTUR NOT PARTICIPATE IN ANY POLITICAL PARTY HERE ARE THE DETAILS TA

Chiranjeevi : పండగ రోజున తన రిటైర్మెంట్‌ను అఫీషియల్‌గా ప్రకటించిన చిరంజీవి.. మెగాస్టార్ సంచలన నిర్ణయం..

చిరంజీవి సంచలన నిర్ణయం (Twitter/Photo)

చిరంజీవి సంచలన నిర్ణయం (Twitter/Photo)

Chiranjeevi : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని రెండు దశాబ్దాలకు పైగా ఏలిన మెగాస్టార్ చిరంజీవి.. ఇక తన రిటైర్మెంట్‌ గురించి అఫీషియల్‌గా ప్రకటించి సంచలనం రేపారు.

  03Chiranjeevi : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని రెండు దశాబ్దాలకు పైగా ఏలిన మెగాస్టార్ చిరంజీవి.. ఇక తన రిటైర్మెంట్‌ గురించి అఫీషియల్‌గా ప్రకటించి సంచలనం రేపారు. వివరాల్లోకి వెళితే.. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు ఆకాశాన్నంటాయి. మరోవైపు ఏపీ రాజకీయాల్లో సీఎం జగన్ - చిరంజీవిల భేటీ హాట్ టాపిక్ అవుతోంది. రెండు రోజుల నుంచి అదే చర్చ సందడి చేస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభలో అడుగుపెడుతారంటూ ఒకటే చర్చ నడుస్తోంది.  గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. అంతేకాదు సీఎం జగన్ తీసుకున్న పలు నిర్ణయాలను కూడా స్వాగతించారు. ఆ మధ్య ఏపీ సీఎం కర్నూలు ఎయిర్ పోర్ట్‌కు మొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా పేరు పెట్టడంతో పాటు పలు అంశాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను మెచ్చుకున్నారు.

  ‘నేను ఇండస్ట్రీ పెద్ద కాదు.. నాకు అవ్వాలని కూడా లేదు.. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు.. కానీ బాధ్యతగా ఉంటా.. అవసరం అనుకున్నపుడు కచ్చితంగా ముందుకొచ్చి అండగా ఉంటానన్నారు. కానీ చిరు మాత్రం ఇండస్ట్రీ పెద్దగా కాకుండా.. ఇండస్ట్రీ బిడ్డగా ఏపీ సీఎం జగన్‌ను కలిసినట్టు చెప్పుకొచ్చారు. తాను సినీ పరిశ్రమ మేలు కోసం, థియేటర్స్ మనుగడ కోసం, ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టు చెప్పుకొచ్చారు.

  South Heroes Instagram followers : అల్లు అర్జున్ సహా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోయర్స్ ఉన్న టాప్ 10 సౌత్ హీరోలు వీళ్ళే..


  ఇక ఏపీ సీఎంతో జరిగిన చర్చించిన విషయాలను పక్క దారి పట్టించే విధంగా,.. ఆ మీటింగ్‌కు పొలిటికల్ ఇష్యూ చేస్తున్నాయి. నన్ను రాజ్యసభకు పంపుతున్నట్టు కొన్ని మీడియా సంస్థల వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అవన్నీ నిరాధారం అంటూ తన ట్విట్టర్ వేదికగా అఫీషియల్‌గా ప్రకటించారు.

  Radhe Shyam - Shyam Singha Roy : శ్యామ్ సింగరాయ్, రాధే శ్యామ్, బింబిసార సహా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఇవే..


  రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్లీ రాజకీయాల్లోకి, చట్ట సభలకు రావడం జరిగే పనికాదన్నారు. దయచేసి ఊహాగానాలకు తావిచ్చే వార్తలను ప్రసారం చేయవద్దు . ఈ వార్తలకు, చర్చలకు ఇప్పటితో పులిస్టాప్ పెట్టమని కోరుతున్నానన్నారు. దీంతో భవిష్యత్తులో చిరంజీవి రాజకీయాల్లో వస్తాడన్న మెగాభిమానులకు సంక్రాంతి పండగ రోజున పెద్ద షాకే ఇచ్చారు. ఇక 2014 తర్వాత చిరంజీవి అంతగా యాక్టివ్‌గా లేరు. ఈ విషయంలో చిరంజీవి అభిమానులు పెద్దగా బాధపడాల్సిన పనిలేదు. అన్నయ్య ప్రజారాజ్యం లేకున్నా.. తమ్ముడు పవన్ కళ్యాణ్‌ ‘జనసేన’కు అండగా ఉండడానికి ఇప్పటికే మానసికంగా ఫిక్స్ అయ్యారు.
  మెగాస్టార్ చిరంజీవి 2008 ఆగష్టులో  ‘ప్రజా రాజ్యం’ అనే పార్టీ పెట్టి రాజకీయాల్లో వెళ్లడం.. ఉమ్మడి ఏపీలో 2009లో జరిగిన ఎన్నికల్లో వై.యస్. రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఓ వైపు... చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని చంద్రబాబు నాయుడును మరోవైపు ఢీ కొట్టి.. ఉమ్మడి ఏపీలో  18 సీట్లు గెలిచారు. ఆ ఎన్నికల్లో  చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనూహ్యంగా పాలకొల్లు నుంచి ఓడిపోయారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆ తర్వాత మన్మోహన్‌ సింగ్ క్యాబినేట్‌లో టూరిజం మినిష్టర్‌గా చేసారు.

  Nagarjuna - Ramesh Babu - Jagapathi Babu : నాగార్జున, రమేష్ బాబు, జగపతి బాబు మధ్య గల ఈ చిత్రమైన పోలిక తెలుసా..


  ఆ తర్వాత 2014లో ఏపీలో కాంగ్రెస్ ప్రచార సారథిగా ప్రచారం నిర్వహించిన ఉమ్మడి ఏపీని విభజించిన కారణంగా అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ లేకుండా చేసిన సంగతి తెలిసిందే కదా.దీంతో కలిసొచ్చిన సినిమాలను నమ్ముకొని ‘ఖైదీ నంబర్ 150’తో హీరోగా ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో కుమ్మేస్తోన్న సంగతి తెలిసిందే కదా.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Acharya film, Ap cm ys jagan mohan reddy, Chiranjeevi, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు