సరిలేరు నీకెవ్వరు’ వేదికపై చిరు,విజయశాంతిల కెమిస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు రష్మిక తనను కాంట్రాక్ట్ తీసుకుందా అని ప్రస్తావించడం కూడా ’సరిలేరు నీకెవ్వరు’ వేదికపై హైలెట్‌గా నిలిచింి.
‘సరిలేరు నీకెవ్వరు’ వేదికపై చిరు,విజయశాంతిల కెమిస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా విజయశాంతితో తన అనుబంధం గుర్తు చేసుకున్నారు చిరంజీవి. అంతేకాదు స్టేజ్ పై విజయశాంతిని చాలా సార్లు నా హీరోయిన్.. నా హీరోయిన్ అని ప్రస్తావించారు చిరంజీవి. మధ్యలో తనతో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించిన తమన్నా కూడా తన హీరోయినే అన్నారు. అంతేకాదు.. రష్మిక, స్నేహకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. మొత్తానికి ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబుతో పాటు కృష్ణ గారికి కూడా పొగిడారు.మరోవైపు చిత్ర నిర్మాతలు, దర్శకుడు అనిల్ రావిపూడిని కూడా ప్రీ రిలీజ్ వేడుకగా పొగిడారు. అంతేకాదు రష్మిక మందన్నతో తన అనుబంధం గుర్తు చేసుకన్నారు. ఆమె నన్ను కాంట్రాక్ట్ తీసుకుందా చిరు ప్రస్తావించాడు. ఆమె నటించిన ‘ఛలో’, ‘గీతా గోవిందం’, ఇపుడు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చానని ప్రస్తావించారు. ఆమె నన్ను అలా కాంట్రాక్ట్ తీసుకోవడం వల్లే నేను వచ్చానేమో అని కొంచెం కొంటెగా చిరంజీవి మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది.