చిరంజీవి ఇంక రాజకీయాలకు సెలవేనా..?

ఒక్కసారి తనకు నచ్చిన గ్రౌండ్‌లోకి దిగితే బ్యాటింగ్ ఎలా ఉంటుందో పదేళ్ల తర్వాత వచ్చినా కూడా అందరికీ అర్థమయ్యేలా చూపించాడు చిరంజీవి. పొలిటికల్ వదిలి.. సినిమా వైపు వచ్చి ఖైదీ నెం.150తో 100 కోట్ల విజయాన్ని అందుకుని.. అప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడూ తాను నెంబర్ వన్ అని నిరూపించుకున్నాడు అన్నయ్య.

news18-telugu
Updated: August 22, 2018, 7:46 AM IST
చిరంజీవి ఇంక రాజకీయాలకు సెలవేనా..?
చిరంజీవి (ఫేస్‌బుక్ ఫోటో)
  • Share this:
రాజకీయాలు నాకు రావు.. అలవాటు లేవు అంటూనే పదేళ్ల పాటు ఉన్నాడు. అలా ఉన్న తర్వాతే తెలిసింది తన లాంటి వాళ్లకు ఇక్కడ సెట్ అవ్వదని. అందుకే మళ్లీ తన ప్లే గ్రౌండ్ అయిన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసాడు అన్నయ్య. సినిమాల్లో ఉన్నపుడు చిరంజీవి కంటే ఈయన్ని కొట్టేవాళ్లు లేరు. కానీ అసలేమాత్రం తనకు సంబంధం లేని రాజకీయాల్లోకి వెళ్లి బొక్కబోర్లా పడ్డాడు మెగాస్టార్.

chiranjeevi politics
chiranjeevi file photo


నెంబర్ వన్ హీరోగా ఉండి "ప్రజారాజ్యం" పార్టీ స్థాపించిన చిరు.. చాలా తక్కువ టైమ్‌లోనే రాజకీయాలు తనకు అచ్చిరావని అర్థం చేసుకున్నాడు. అందుకే ప్రజారాజ్యం పార్టీని "కాంగ్రెస్‌"లో విలీనం చేసి తాను కూడా అక్కడే  కేంద్ర మంత్రి పదవి మారిపోయాడు. అయితే రాజకీయాల్లో ఉన్నంత కాలం విమర్శలు కూడా చాలానే అందుకున్నాడు చిరంజీవి. కానీ ఒక్కసారి అక్కడ అడుగు పెట్టిన తర్వాత ఆయన వదలిపెట్టినా.. అవి వదిలిపెట్టవు. అందుకే నచ్చకపోయినా.. కష్టం అనిపించినా దాదాపు 8 ఏళ్లు ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నాడు మెగాస్టార్. ఇక ఇప్పుడు పూర్తిస్థాయిలో మళ్లీ సినిమా రంగంవైపు వచ్చేసారు.

chiru birth day
చిరు బర్త్ డే


ఒక్కసారి తనకు నచ్చిన గ్రౌండ్‌లోకి దిగితే బ్యాటింగ్ ఎలా ఉంటుందో పదేళ్ల తర్వాత వచ్చినా కూడా అందరికీ అర్థమయ్యేలా చూపించాడు చిరంజీవి. పొలిటికల్ వదిలి.. సినిమా వైపు వచ్చి "ఖైదీ నెం.150"తో 100 కోట్ల విజయాన్ని అందుకుని.. అప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడూ తాను నెంబర్ వన్ అని నిరూపించుకున్నాడు అన్నయ్య. అందుకే ఇక నుంచి పూర్తిగా సినిమాల్లోనే ఉండాలని ఫిక్స్ అయిపోయాడు చిరంజీవి.

కనీసం రాజకీయాల గురించి ఆలోచించే టైమ్ కూడా ఇవ్వకుండా బిజీ అయిపోయాడు మెగాస్టార్. ప్రస్తుతం "సైరా"తో బిజీగా ఉన్న చిరు.. వెంటనే కొరటాల శివను లైన్‌లో పెడుతున్నాడు.. ఆ తర్వాత బోయపాటి శీను కథ పట్టుకుని ఉన్నాడు. ఇలా రాజకీయాలకు పూర్తిగా సెలవిచ్చేసి హాయిగా తనకు అచ్చొచ్చిన ప్లే గ్రౌండ్‌లోనే సిక్సులు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు చిరంజీవి. అభిమానులకు కూడా ఈయన్ని రాజకీయాల్లో కంటే తెరపై చూడ్డానికే ఇష్టపడుతున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 22, 2018, 8:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading