Home /News /movies /

CHIRANJEEVI SAYS ABOUT DAGGUBATI RANA FRIENDSHIP WITH RAM CHARAN SLB

Daggubati Rana: రామ్ చరణ్‌ గదిలో రానా చిలిపి పనులు.. సీక్రెట్ బయటపెట్టిన చిరంజీవి

Photo Twitter

Photo Twitter

Ram Charan Rana: రామ్ చరణ్, రానా స్నేహం గురించి, రానా చేసిన చిలిపి పనులపై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తెలుగు ఇండియన్ ఐడల్(Telugu Indian Idol) గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌‌లో రానా ముందే ఓపెన్ అయ్యారు చిరంజీవి. చిన్ననాటి సంగతి ఒకటి చెబుతూ రానా సీక్రెట్ బయటపెట్టారు.

ఇంకా చదవండి ...
సినీ ఇండస్ట్రీలో కొందరు తారల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. స్టార్ కిడ్స్ అయిన కొంతమంది చిన్నప్పటి నుంచే ఎంతో స్నేహంగా ఉంటూ ఇప్పుడు హీరోలుగా వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఆ లిస్టులో దగ్గుబాటి రానా (Rana), రామ్ చరణ్(Ram charan) కూడా ఉన్నారు. చిన్నతనం నుంచే ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే తాజాగా వీళ్లిద్దరి స్నేహం, చిలిపి పనులపై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తెలుగు ఇండియన్ ఐడల్(Telugu Indian Idol) గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌‌లో రానా ముందే ఓపెన్ అయ్యారు చిరంజీవి (Chiranjeevi). చిన్ననాటి సంగతి ఒకటి చెబుతూ రానా సీక్రెట్ బయటపెట్టారు.

ప్రముఖ OTT వేదిక ఆహాలో (Aha) స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ (Indian Idol Telugu Reality show) రియాలిటీ షో తుది అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ ఫినాలే నిర్వహించేలా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఈ గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా చిరంజీవిని ఆహ్వానించారు. ఈ శుక్రవారం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈవెంట్‌ను అదిరిపోయేలా ప్లాన్ చేసిన నిర్వాహకులు.. ఇందుకు సంబంధించిన ప్రోమోలు ఒక్కొక్కటిగా వదులుతూ ఎపిసోడ్ పై ఆసక్తి రేకెత్తిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా వదిలిన ఓ ప్రోమో వీడియోలో మెగాస్టార్ చిరంజీవికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలతో పాటు ఈ ఈవెంట్‌కి అతిథులుగా వచ్చిన రానా, సాయి పల్లవి (Rana Sai Pallavi) సీన్స్ హైలైట్ అవుతున్నాయి. ఇక ఇదే వీడియోలో రానా చిన్నప్పటి సీక్రెట్‌ని చిరంజీవి బయటపెట్టడం మరింత ఆసక్తి రేకెత్తించింది. దీంతో ప్రస్తుతం ఈ తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోమో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో చిరు ఎంతో చురుగ్గా కనిపించడమే గాక సందర్భానుసార పంచులతో పరేషాన్ చేసేశారు. గాయనీగాయకులతో కలిసి అల్లరల్లరి చేస్తూ జడ్జ్‌లు, డైరెక్షన్ టీం మీద కౌంటర్లు వేస్తూ తెగ హంగామా చేశారు. అయితే రామ్ చరణ్ విషయాన్ని రానా ఎత్తుతూ.. పదోతరగతో, పదకొండో తరగతో అని ఏదో చెప్పబోతుండగా ఇంతలో చిరంజీవి మధ్యలో కలుగజేసుకొని ఆ సందర్భాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఆ తరవాత ఏం జరిగిందో నేను చెబుతాను అంటూ ముందుకొచ్చిన చిరంజీవి.. రామ్ చరణ్ రూంలో ఉండే కిటికీ తలుపుల గ్రిల్ తీసేవాడు రానా అని ఆ నాడు చేసిన అల్లరి పనులను బయటపెట్టారు చిరు. దీంతో రానా కాస్త వెరైటీ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం ఈ వీడియోలో స్పెషల్ అట్రాక్షన్ అయింది.
Published by:Sunil Boddula
First published:

Tags: Ram Charan, Rana daggubati, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు