Chiranjeevi - Salman Khan: చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్‌లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించనున్నారా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. వివరాల్లోకి వెళితే.. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ చేసారు. రెండు పాటలు మాత్రం బ్యాలెన్స్‌గా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు సమాంతరంగా జరుగుతున్నాయి. చిరంజీవి బర్త్ డే రోజున ఈ సినిమాకు విడుదల తేదికి సంబంధించి ప్రకటన చేయవచ్చు అంటున్నారు. ఈ చిత్రంలో చిరుకు జోడి కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే యాక్ట్ చేస్తోంది. ఈ సినిమా తర్వాత చిరు.. లూసీఫర్ రీమేక్ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛంగా ప్రారంభమైంది. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ దాదాపు ఖరారైంది. చిరంజీవి పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించిన అఫీసియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ’లూసీఫర్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ ఈ చిత్రంలో కీ రోల్ పోషించారు. ఇపుడు అదే పాత్రని తెలుగులో సల్మాన్ ఖాన్‌తో చేయించాలనుకున్నట్టు సమాచారం. ఇక ముందుగా ఈ పాత్ర కోసం రామ్ చరణ్ పేరును చిరు పరిశీలించారు.
ఆ తర్వాత అల్లు అర్జున్ పేరు లైన్‌లోకి వచ్చింది. తాజాగా సల్మాన్ ఖాన్ పేరును చిరంజీవి సూచించాడట. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఈ చిత్రంలో నటించడానికి ఓ కండిషన్ పెట్టాడట. తెలుగులో తను ఈ పాత్రను చేస్తే.. హిందీ రీమేక్ హక్కులను తనకు ఇవ్వడంతో పాటు హిందీలో తాను చిరంజీవి పాత్రను చేస్తే.. తెలుగులో తాను చేసిన పాత్రను హిందీలో రామ్ చరణ్ చేయాలని కండిషన్స్ పెట్టాడట.
మరి సల్మాన్ కండిషన్స్‌ను చిరంజీవి ఏ మేరకు ఒప్పకుంటాడా అనేది చూడాలి.మరోవైపు ఈ సినిమలో వివేక్ ఓబరాయ్ పాత్రలో సత్యదేవ్ నటించనున్నారు. ఈ సినిమాలో చిరు చెల్లెలు పాత్రలో నయనతార దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఇక తమ్ముడు పాత్రలో వరుణ్ తేజ్‌ను దాదాపు ఫైనల్ చేసినట్టు సమాచారం. మరి ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు పూర్తిగా తెలియాలంటే చిరు బర్త్ డే వరకు ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి..
HBD Mahesh Babu : తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో మహేష్ బాబు ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా..
Controversial Photoshoots: కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఫోటోషూట్స్ ఇవే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acharya, Bollywood news, Chiranjeevi, Lucifer, Mohanlal, Ram Charan, Salman khan, Tollywood