Home /News /movies /

CHIRANJEEVI SALMAN KHAN JOINS SHOOTING IN MEGASTAR GOD FATHER MOVIE TA

Chiranjeevi - Salman Khan God Father : సల్మాన్‌ఖాన్‌కు చిరంజీవి గ్రాండ్ వెల్కమ్.. గాడ్ ఫాదర్ షూటింగ్‌లో సల్లూ భాయ్..

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సల్మాన్ ఖాన్ (Twitter/Photo)

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సల్మాన్ ఖాన్ (Twitter/Photo)

Chiranjeevi As God Father -  Salman Khan: మెగాస్టార్  చిరంజీవి  మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌గా రీమేక్ చేస్తోన్నసంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో సల్మాన్ ఖాన్ అయ్యారు.

ఇంకా చదవండి ...
    Chiranjeevi - Salman Khan God Father :  మెగాస్టార్  చిరంజీవి  మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌గా రీమేక్ చేస్తోన్నసంగతి తెలిసిందే కదా. రీసెంట్‌గా ఊటీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం కంప్లీటైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది.  ఇక ‘గాడ్ ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్‌లో సల్మాన్ ఖాన్ జాయిన్ అయ్యారు. అంతేకాదు సల్లూ భాయ్‌కు వెల్కమ్ చెబుతూ మెగాస్టార్ ఓ ట్వీట్ చేసారు. అంతేకాదు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఈ సినిమా లెవల్ పెరిగిందన్నారు. ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా కిక్ ఎక్కడం ఖాయం అన్నారు.  ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్  ఓ వారం రోజుల కాల్షీట్స్‌ను  అడ్జస్ట్ చేసారు.

    ఈ సినిమాను మలయాళం తప్ప మిగిలిన కన్నడ, తమిళ్, హిందీలో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్, బ్రిట్నీ స్పియర్స్‌తో ఓ స్పెషల్ సాంగ్‌ ఉంది.  మలయాళ ఒరిజినల్ ’లూసీఫర్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ ఆ చిత్రంలో కీ  రోల్ పోషించారు. ఇపుడు అదే పాత్రని తెలుగులో సల్మాన్ ఖాన్‌ చేస్తున్నారు.



    ఇక  ముందుగా ఈ పాత్ర కోసం రామ్ చరణ్ పేరును చిరు పరిశీలించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ పేరు లైన్‌లోకి వచ్చింది. ఫైనల్‌గా సల్మాన్ ఖాన్‌తో ఈ రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కోసం ఓ పాటను కొంచెం పాత్ర నిడివి కూడా పెంచారు. అందుకు తగ్గేట్టే ఈ సినిమాలో పలు మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం.

    RRR : ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్‌ను ఆపాలంటూ దాఖలైన పిల్‌ను కొట్టేసినా తెలంగాణ హైకోర్టు..


    మరోవైపు ఈ సినిమలో వివేక్ ఓబరాయ్ పాత్రలో మాధవన్  నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో చిరు చెల్లెలు పాత్రలో నయనతార యాక్ట్ చేస్తోంది  ఇక ఈ చిత్రంలో   సత్యదేవ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇక చిరంజీవి ..  కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేశారు. ఈ చిత్రాన్ని  ఏప్రిల్ 29 వ తేదిన విడుదల చేస్తున్నారు.  ఈ చిత్రంలో చిరుకు జోడి కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే యాక్ట్ చేసింది. ఈ సినిమా దాదాపు 3 గంటల నిడివి ఉన్నట్టు సమాచారం. మరోవైపు చిరు, మెహర్ రమేష్, బాబీ సినిమాలతో పాటు  చిరంజీవి.. వెంకీ కుడుముల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమాకు ఓకే చెప్పారు. ఈ సినిమాలో చిరు సరసన అనుష్క శెట్టి నటించబోతున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood news, Chiranjeevi, God Father Movie, Salman khan, Tollywood

    తదుపరి వార్తలు