హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi |God Father : చిరంజీవి గాడ్ ఫాదర్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ మూడు సినిమాలతో పోటీ..

Chiranjeevi |God Father : చిరంజీవి గాడ్ ఫాదర్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ మూడు సినిమాలతో పోటీ..

Godfather Locks Its Release Date

Godfather Locks Its Release Date

Chiranjeevi | God Father :  మెగాస్టార్  చిరంజీవి  (Chiranjeevi God Father)  మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌గా రీమేక్ చేస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

ఇంకా చదవండి ...

Chiranjeevi | God Father :  మెగాస్టార్  చిరంజీవి  (Chiranjeevi God Father)  మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌గా రీమేక్ చేస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం కంప్లీటైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan )కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా విడుదల విషయంలో చిత్రబృందం అప్పుడే ఓ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ (God Father Release date) సినిమాను ఆగస్ట్ 11న రిలీజ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ డిసైడ్ అయ్యినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15 సోమవారం అవ్వడంతో వరుసగా సెలవులు కలిసి వస్తాయని భావిస్తోందట చిత్రబృందం. ఇక్కడ విషయం ఏమంటే ఇదే డేట్‌కు అఖిల్ ఏజెంట్, సమంతా యశోద, అమీర్ ఖాన్ యొక్క లాల్ సింగ్ చద్దా కూడా రానున్నారట. థమన్ (Thaman) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ (God Father) సినిమాను మలయాళం తప్ప మిగిలిన కన్నడ, తమిళ్, హిందీలో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉంది టీమ్. మలయాళ ఒరిజినల్ ’లూసీఫర్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ ఆ చిత్రంలో కీ  రోల్ పోషించారు. ఇపుడు అదే పాత్రని తెలుగులో సల్మాన్ ఖాన్‌ చేస్తున్నారు. ఇక  ముందుగా ఈ పాత్ర కోసం రామ్ చరణ్ పేరును చిరు పరిశీలించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ పేరు లైన్‌లోకి వచ్చింది. ఫైనల్‌గా సల్మాన్ ఖాన్‌తో ఈ రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కోసం ఓ పాటను కొంచెం పాత్ర నిడివి కూడా పెంచారు. అందుకు తగ్గేట్టే ఈ సినిమాలో పలు మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం.

మరోవైపు ఈ సినిమలో వివేక్ ఓబరాయ్ పాత్రలో మాధవన్  నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి (Chiranjeevi) చెల్లెలు పాత్రలో నయనతార (Nayanthara) యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సత్యదేవ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇక చిరంజీవి నటిస్తున్న ఆచార్య విషయానికి వస్తే..  కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29 వ తేదిన విడుదల చేస్తున్నారు.  ఈ చిత్రంలో చిరుకు జోడి కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా దాదాపు 3 గంటల నిడివి ఉన్నట్టు సమాచారం. మరోవైపు చిరు, మెహర్ రమేష్, బాబీ సినిమాలతో పాటు  చిరంజీవి.. వెంకీ కుడుముల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమాకు ఓకే చెప్పారు. ఈ సినిమాలో చిరు సరసన అనుష్క శెట్టి నటించబోతున్నట్టు సమాచారం.

First published:

Tags: Chiranjeevi, God Father Movie, Nayanthara, Salman khan

ఉత్తమ కథలు