Chiranjeevi - Ravi Teja : చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో రవితేజ.. అలా ప్లాన్ చేస్తోన్న బాబీ..

రవితేజ,చిరంజీవి (Twitter/Photo)

Chiranjeevi - Ravi Teja : చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో రవితేజ నటించనున్నారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు.

  • Share this:
    Chiranjeevi - Ravi Teja : చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో రవితేజ నటించనున్నారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మెగాస్టార్ తన తనయుడు రామ్ చరణ్‌తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతోంది. మరోవైపు చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలు పాత్రలో అలరించనుంది. ఇంకోవైపు బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నారు.

    పూర్తి మాస్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కనున్న ఈ  చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే బాబీ.. రవితేజ హీరోగా నటించిన ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే కదా.  కథ ప్రకారం ఈ సినిమాలో మరో హీరోకు అవకాశం ఉంది. ఆ పాత్రను రవితేజ వంటి ఎనర్జిటిక్ హీరోతో చేయిస్తే.. బాగుంటుందనే ఉద్దేశ్యంతో బాబీ ఈ సినిమా కోసం కలిసాడట. పైగా చిరంజీవి హీరో కావడంతో రవితేజ ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

    Pawan Kalyan Vs Posani : పోసాని నిజంగానే మెంటల్ కృష్ణ.. ఆయన్ని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలి.. నిహారిక కామెంట్స్..


    గతంలో రవితేజ.. చిరంజీవి హీరోగా నటించిన హిందీ మూవీ ‘ఆజ్ కా గూండారాజ్’ సినిమాలో నలుగురు స్నేహితుల్లో ఒకరిగా నటించారు. ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి, సౌందర్య హీరో,హీరోయిన్లుగా నటించిన ‘అన్నయ్య’ చిత్రంలో చిరు తమ్ముడు పాత్రలో నటించారు.

    Chiranjeevi-Ravi Teja: మెగాస్టార్ టైటిల్ కొట్టేయాలని చూస్తున్న మాస్ మహారాజ్ రవితేజ..


    ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’లో ఓ పాటలో రవితేజ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ పాత్రలో అలరించారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటించారు. ఒకవేళ చిరంజీవి, బాబీ సినిమాలో రవితేజ నటిస్తే.. మెగాస్టార్, మాస్ మహారాజ్ కాంబినేషన్‌లో వస్తోన్న నాల్గో చిత్రం అవుతోంది.

    Chiranjeevi : ఆ ఫ్లాప్ దర్శకుడికి చిరంజీవి మరో ఛాన్స్ ఇస్తారా.. ? మెగాస్టార్ లిస్టులో మరో దర్శకుడు..


    రవితేజ విషయానికొస్తే.. ఈయన ప్రస్తుతం ‘ఖిలాడి’ మూవీ చేస్తున్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో అలరించనున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నారు. హీరోయిన్స్‌గా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇంకోవైపు రవితేజ.. శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు’ అన్ డ్యూటీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో  ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: