CHIRANJEEVI RAVI TEJA ACCEPT MEGASTAR CHIRANJEEVI BOBBY PROJECT AND HE TAKE HIGH REMUNARATION FOR HIS CHARECTER IN THIS FILM HERE ARE THE DETAILS TA
Chiranjeevi - Ravi Teja : చిరు, బాబీ సినిమాలో యాక్ట్ చేయడానికి రవితేజ రికార్డు రెమ్యునరేషన్..
చిరంజీవి, రవితేజ (Raviteja and Chiranjeevi Photo : Twitter)
Chiranjeevi - Ravi Teja : చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో రవితేజ నటించడానికి ఓకే చెప్పాడా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. ఈ చిత్రంలో నటించడానికి రవితేజ రికార్డు స్థాయి పారితోషకం అందుకోబోతున్నట్టు సమాచారం.
Chiranjeevi - Ravi Teja : చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో రవితేజ నటించడానికి ఓకే చెప్పాడా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మెగాస్టార్ తన తనయుడు రామ్ చరణ్‌తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ కంప్లీట్ చేసారు. ఈ సినిమాను ముందుగా ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఓమైక్రాన్ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ ‘రాధే శ్యామ్’ బాటలో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.ఇక ఈ సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించక ముందే.. ‘ఆచార్య’ మూవీని ఏప్రిల్ 1న ఉగాది కానుకగా విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. మరోవైపు చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ఊటీ షెడ్యూల్ కంప్లీట్ చేసారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తైయినట్టు సమాచరాం. ఈ నెలాఖరు నుంచి సల్మాన్ ఖాన్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నారు.
మరోవైపు చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలు పాత్రలో అలరించనుంది. తమన్నా హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ కానీకొచ్చింది. ఈ సినిమాలో నాగ శౌర్య .. కీర్తి సురేష్ భర్త పాత్రలో నటిస్తోన్నట్టు సమాచారం. మొత్తంగా చిరంజీవి హీరోగా నటిస్తోన్న ప్రతి చిత్రంలో వేరే హీరో యాక్ట్ చేస్తూ ఉండటం ప్రత్యేకంగా చెప్పాలి.
చిరంజీవి ఇంకోవైపు బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా కూడా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. పూర్తి మాస్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే బాబీ.. రవితేజ హీరోగా నటించిన ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే కదా. కథ ప్రకారం ఈ సినిమాలో మరో హీరోకు అవకాశం ఉంది. ఆ పాత్రను రవితేజ వంటి ఎనర్జిటిక్ హీరోతో చేయిస్తే.. బాగుంటుందనే ఉద్దేశ్యంతో బాబీ ఈ సినిమా కోసం కలిసాడట. పైగా చిరంజీవి హీరో కావడంతో రవితేజ ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.
గతంలో రవితేజ.. చిరంజీవి హీరోగా నటించిన హిందీ మూవీ ‘ఆజ్ కా గూండారాజ్’ సినిమాలో నలుగురు స్నేహితుల్లో ఒకరిగా నటించారు. ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి, సౌందర్య హీరో,హీరోయిన్లుగా నటించిన ‘అన్నయ్య’ చిత్రంలో చిరు తమ్ముడు పాత్రలో నటించారు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’లో ఓ పాటలో రవితేజ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ పాత్రలో అలరించారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటించారు. ఒకవేళ చిరంజీవి, బాబీ సినిమాలో రవితేజ నటిస్తే.. మెగాస్టార్, మాస్ మహారాజ్ కాంబినేషన్లో వస్తోన్న నాల్గో చిత్రం అవుతోంది. ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి మాస్ మహారాజ్‌కు భారీగానే ముట్టజెప్పబోతున్నట్టు సమాచారం.
ఈ సినిమాలో యాక్ట్ చేక్ట్ చేయడానికి రవితేజకు ఒక్కో రోజుకు రూ. 25 లక్షల చొప్పున పారితోషకం ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రవితేజ పాత్రలను 7 నుంచి 10 రోజుల్లో కంప్లీట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రవితేజకు ఈ సినిమాకు రూ. 1.75 కోట్ల నుంచి రూ. 2.5 కోట్ల వరకు పారితోషకం అందుకునే అవకాశం ఉంది. అప్పట్లో చిరంజీవి నటించిన ‘అన్నయ్య’ సినిమాలో నటించడానికి మొత్తంగా రూ. 1.5 లక్షల పారితోషకం అందుకున్న రవితేజ.. ఇపుడు అదే మెగాస్టార్‌తో రోజుకు రూ. 25 లక్షల పారితోషకం అందుకునే రేంజ్‌కు ఎదగడం విశేషం.
రవితేజ విషయానికొస్తే.. ఈయన ప్రస్తుతం ‘ఖిలాడి’ మూవీ చేస్తున్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో అలరించనున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నారు. హీరోయిన్స్‌గా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇంకోవైపు రవితేజ.. శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు’ అన్ డ్యూటీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు.
ఈ సినిమాకు రవితేజ ఒక నిర్మాత వ్యవహరిస్తున్నారు. మరోవైపు నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘ధమాకా’ సినిమా చేస్తున్నారు. దాంతో పాటు ‘స్టూవర్ట్‌పురం దొంగ’ టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌ను ప్యాన్ ఇండియా లెవల్లో చేస్తున్నారు. దాంతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ సినిమా చేస్తున్నారు. మొత్తంగా చేతిలో అర డజను పైగా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అన్నయ్య సినిమా కోసం గెస్ట్ రోల్ చేయడానికి రవితేజ ఓకే చెప్పడం విశేషమనే చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.