Ram Charan-Pawan Kalyan-Chiranjeevi: | చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకరి తర్వాత మరొకరు మెగా హీరోలందరు చరిత్రను తిరగరాసే పనిలో పడ్డారు. అవును ప్రస్తుతం మెగా హీరోలందరు ఒకరి తర్వాత మరొకరు చరిత్రలోకి వెళుతున్నారు. ప్రజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి, అబ్బాయి రామ్ చరణ్ రూట్లో తొలిసారి చారిత్రక పాత్రలో నటిస్తున్నారు. . వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం’ అనే సినిమా చేస్తున్నాడు. అదేనండి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో రామ్ చరణ్.. చారిత్రక యోధుడైన అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్లో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో ఓ రేంజ్లో ఇరగదీసాడు. ఈ చిత్రం ఈ యేడాది అక్టోబర్ 13న విడుదల కానుంది. ఆర్ఆఆర్ఆర్ కంటే ముందు చిరంజీవి..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చారిత్రక యోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా.
ఇక రామ్ చరణ్ .. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను రాజమౌళి కొంచెం ఫిక్షన్ జోడించి తనదైన శైలిలో ఆర్ఆర్ఆర్లో అల్లూరి పాత్రను మలుస్తున్నాడు.
రామ్ చరణ్ లుక్ (rrr ram charan)
అటు చిరంజీవి, రామ్ చరణ్ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న ‘హరి హర వీరమల్లు’ కూడా చారిత్రక యోధుడు పాత్రను చేస్తున్నాడు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ తన సినీ జీవితంలో ఫస్ట్ టైమ్ చారిత్రక పాత్ర చేస్తోన్న సినిమా ఇదే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తోన్న తొలి ప్యాన్ ఇండియా మూవీ. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో ఒకేసారి విడుదల చేస్తున్నారు.
హరి హర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)
అంతకు ముందు మెగా ఫ్యామిలీ హీరో అయిన అల్లు అర్జున్ కూడా ‘రుద్రమదేవి’ చిత్రంలో గోనా గన్నారెడ్డి వంటి చారిత్రక యోధుడి పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే కదా. ఈ రకంగా మెగా ఫ్యామిలీ హీరోలందరు ఒక్కొక్కరుగా చారిత్రక పాత్రలు చేయడం చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.