Home /News /movies /

Acharya Postponed: చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎపుడంటే..

Acharya Postponed: చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎపుడంటే..

‘ఆచార్య’లో చిరంజీవి, రామ్ చరణ్(Twitter/Photo)

‘ఆచార్య’లో చిరంజీవి, రామ్ చరణ్(Twitter/Photo)

Acharya Postponed:  మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా ఆచార్య. ఈ సినిమాను  బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.  తాజాగా ఈ సినిమా విడుదల తేది వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇంకా చదవండి ...
    Acharya Postponed:  మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా ఆచార్య. ఈ సినిమాను  బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.  ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా మే 13న విడుదలకానుందని ప్రకటించింది చిత్రబృందం. ప్రస్తుతం దేశంలో కోవిడ్ -19 విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రోజుకు 3 లక్షలకు పైగా కేసులు దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్నాయి. ఈ కరోనా ధాటికి సామాన్యులతో పాటు  పలువురు రాజకీయనాయకులు, షూటింగ్స్‌లో పాల్గొంటున్న ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఈ కోవిడ్ ప్రభావం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా సినీ రంగంపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పటికే షెడ్యూల్ అయిన పలు సినిమాలు ఇపుడు విడుదల తేదిని పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి.

    తాజాగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న ‘ఆచార్య’ సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.ఆచార్య కొత్త విడుదల తేదిని త్వరలో ప్రకటించనున్నట్టు చెప్పుకొచ్చారు. ఇప్పటికే కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ కొంత బ్యాలెన్స్ ఉంది. పైగా గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తి కాలేదని టాక్.


    ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర ఓ ముప్పై నిమిషాల వరకు ఉంటుందని టాక్. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ‌లో కూడా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా కూడా వచ్చే యేడాది సంక్రాంతికి పోస్ట్ పోన్ అయినట్టు సమాచారం.

    ‘ఆచార్యలో రామ్ చరణ్, పూజా హెగ్డే (Twitter/Photo)


    ఆచార్య విషయానికి వస్తే.. ఈ సినిమాలో మెగాస్టార్ ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగానే కనిపిస్తారని తెలిసిందే. అయితే ఆ పాత్రలో ఆయన కేవలం పది నిముషాలు మాత్రమే కనిపిస్తారట. ప్లాష్ బ్యాక్ వచ్చే కొన్ని సీన్స్ లో మాత్రమే అలా కనిపిస్తారట చిరంజీవి.ఈ  సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. దీనికి సంబందించిన ఆ పాటను ఇప్పటికే షూట్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

    Chiranjeevi Acharya movie,Chiranjeevi Acharya movie dharmasthali temple set,Chiranjeevi Acharya movie dharmasthali temple set budget 20 crores,Chiranjeevi ram charan Acharya movie dharmasthali temple set,Chiranjeevi koratala siva Acharya movie dharmasthali temple set,Chiranjeevi Acharya movie release date,telugu cinema,కొరటాల శివ చిరంజీవి,చిరంజీవి ఆచార్య ధర్మస్థలి టెంపుల్ సెట్,20 కోట్లతో చిరంజీవి ఆచార్య ధర్మస్థలి టెంపుల్ సెట్
    ’ఆచార్య’లో ధర్మస్థలి సెట్


    ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి లూసిఫర్ అనే మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. అక్కడ మోహన్ లాల్ చేసిన పాత్రలో చిరంజీవి కనిపించనున్నాడు. ఈ సినిమాను తెలుగులో మోహన్ రాజా దర్శకతం వహించనున్నాడు. ఈ సినిమాతో పాటు ఆయన వేదాళం అనే తమిళ సినిమాను తెలుగులో చేయనున్నాడు. ఈ సినిమాకు మెహెర్ రమేష్ దర్శకుడు. దాంతో పాటు బాబీ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించిన ‘ఎన్నై ఎరిందాల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నట్టు సమాచారం. మరోవైపు చిరు.. వంశీ పైడిపల్లి, సందీప్ రెడ్డి వంగాలతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయడానికి రెడీగా ఉన్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Acharya, Chiranjeevi, Kajal Aggarwal, Koratala siva, Pooja Hegde, Ram Charan, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు