Home /News /movies /

Chiranjeevi - Ram Charan : తండ్రి చిరంజీవి నట ప్రస్థానంపై రామ్ చరణ్ భావోద్వేగ పోస్ట్..

Chiranjeevi - Ram Charan : తండ్రి చిరంజీవి నట ప్రస్థానంపై రామ్ చరణ్ భావోద్వేగ పోస్ట్..

చిరంజీవి సినీ జర్నీపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్ (Twitter/Photo)

చిరంజీవి సినీ జర్నీపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్ (Twitter/Photo)

Chiranjeevi - Ram Charan : తండ్రి చిరంజీవి నట ప్రస్థానంపై రామ్ చరణ్ భావోద్వేగ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన తండ్రి మొదటి సినిమా నుంచి అప్ కమింగ్ సినిమా వరకు సంబంధించిన పోస్టర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

  Chiranjeevi - Ram Charan : తండ్రి చిరంజీవి నట ప్రస్థానంపై రామ్ చరణ్ భావోద్వేగ పోస్ట్ చేశారు. చిరంజీవి ఈ బుధవారంతో హీరోగా 43 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తనయుడు రామ్ చరణ్.. సామాజిక మాధ్యమాల వేదికగా తన తండ్రి నటించిన మొదటి సినిమా పోస్టర్‌తో పాటు అప్ కమింగ్ ఆచార్య పోస్టర్‌ను కలిపి అభిమానులతో షేర్ చేసుకున్నారు. 43 ఇయర్స్.. స్టిల్ కౌంటింగ్.. మై అప్పా అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆగ‌స్టు 22 చిరంజీవి పుట్టిన రోజైతే సెప్టెంబ‌రు 22 నటుడిగా పుట్టినరోజు. కళామతల్లి చిరంజీవిని అక్కున చేర్చుకున్న రోజు. మీ అందరికి నన్ను నటుడిగా పరిచయం చేసి మీ ఆశీస్సులు పొందినరోజు. నేను మరిచిపోలేని రోజు' అని చిరంజీవి ఓ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా.

  చిరంజీవి ‘పునాది రాళ్లు’ సినిమాతో పరిచయమైన నటుడిగా విడుదలైన ఫస్ట్ మూవీ ‘ప్రాణం ఖరీదు’. క్రాంతి కుమార్ నిర్మించిన ఈ సినిమాను కే.వాసు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో చంద్రమోహన్, జయసుద మెయిన్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీల ో చిరంజీవి సరసన రేష్మా రాయ్ కథానాయికగా నటించింది. ఈ సినిమాతోనే కోట శ్రీనివాసరావు నటుడిగా పరిచయం అయ్యారు.

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య విషయానికి వస్తే.. ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తన 152వ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాలో తనయుడు రామ్ చరణ్‌తో పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.


  బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..

  అంతకు ముందు వీళ్లిద్దరు ‘మగధీర’, ‘బ్రూస్లీ’, ‘ఖైదీ నంబర్ 150’ సినిమాల్లో కలిసి నటించారు. ఇపుడు పూర్తి స్థాయిలో కలిసి నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మే 13న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ ఓ మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట. ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట.

  Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..

  ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడిందని సమాచారం. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

  NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

  ఈ సినిమాతో పాటు చిరంజీవి (Chiranjeevi) హీరోగా ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌లో గాడ్ ఫాదర్ అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ (Lucifer) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఊటీలో మొదలైంది. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మాతృకలో వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) పోషించిన బాబీ పాత్రలో బిజు మీనన్ బాబీ నటించనున్నారట.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Acharya, Chiranjeevi, Ram Charan, Tollywood

  తదుపరి వార్తలు