HOME »NEWS »MOVIE »chiranjeevi ram charan comments on chittoor pawan kalyan fans accident sr

Chiranjeevi-Ram Charan : పవన్ ఫ్యాన్స్ మరణంపై చిరంజీవి, రామ్ చరణ్ దిగ్భ్రాంతి..

Chiranjeevi-Ram Charan : పవన్ ఫ్యాన్స్ మరణంపై చిరంజీవి, రామ్ చరణ్ దిగ్భ్రాంతి..
రామ్ చరణ్, చిరంజీవి Photo : Twitter

Pawan Kalyan : జన సేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సంబరాల్లో విషాదం చోటు చేసుకొన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    జన సేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సంబరాల్లో విషాదం చోటు చేసుకొన్న సంగతి తెలిసిందే. పుట్టిన రోజు వేడుకల్లో బాగంగా ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో కరెంట్ షాక్’కు గురై ముగ్గురు పవన్ కళ్యాణ్ అభిమానులు మ‌ృతిచెందారు. ఏపీలోని చిత్తూరు జిల్లా, కుప్పం లో శాంతి పురం వద్ద ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ కి గురి దుర్మరణం చెందారు. దాదాపు 25 అడుగుల ఫ్లెక్సీ కడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో షాక్‌కు గురై ముగ్గురు మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఈ ఘటనపై పవన్ కళ్యాణ్‌, రామ్ చరణ్‌, వకీల్ సాబ్ టీమ్ ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనసేన తరుపున చనిపోయిన వారికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించగా.. వకీల్ సాబ్ టీమ్ తరుపున నిర్మాతలు కూడా మరో రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఇక ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురికి రూ. 50 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.





    ఈ ఘోర ఘటనపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. చిత్తూరులో పవన్ బర్త్‌డే కి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించటం గుండెను కలిచివేసిందని.. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని.. చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మీ ప్రాణాలు ముఖ్యమని.. ఆ ముగ్గురి మరణం కలిచివేసిందని ట్వీట్ చేశాడు.
    Published by:Suresh Rachamalla
    First published:September 02, 2020, 12:35 IST

    टॉप स्टोरीज