హోమ్ /వార్తలు /సినిమా /

Acharya Pre Release Business : రికార్డు స్థాయిలో చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్‌కు ఎంత రాబట్టాలంటే..

Acharya Pre Release Business : రికార్డు స్థాయిలో చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్‌కు ఎంత రాబట్టాలంటే..

‘ఆచార్య’ టోట్ థియేట్రికల్ బిజినెస్ (Twitter/Photo)

‘ఆచార్య’ టోట్ థియేట్రికల్ బిజినెస్ (Twitter/Photo)

Chiranjeevi - Ram Charan - Acharya Pre Release Theatrical Business |   మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ (Acharya ). ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..

ఇంకా చదవండి ...

  Chiranjeevi - Ram Charan - Acharya |   మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలకానుంది. విడుదలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.  ఇప్పటికే ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. దీంతో ఆచార్య టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవి‌తో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan)  సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట.

  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేస్తే.. మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా కోసం వారం రోజుల పాటు రూ. 50 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. దాంతో పాటు ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 50 ను పది రోజుల పాటు పెంచుకునేందుకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఐదో షోకు మాత్రం అనుమతులు నిరాకరించింది. ఇప్పటికే  ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో అభిమానులు ఈ సినిమా టిక్కెట్స్ కోసం ఎగబడుతున్నారు.మరోవైపు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అధిక రేట్లకే అమ్ముడుపోయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఏరియా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..

  నైజాం (తెలంగాణ):  రూ. 38కోట్లు

  సీడెడ్ (రాయలసీమ): రూ.  18.50 కోట్లు

  ఉత్తరాంధ్ర: రూ.  13 కోట్లు

  ఈస్ట్: రూ. 9.50 కోట్లు

  వెస్ట్: రూ. 7.02 కోట్లు

  గుంటూరు: రూ. 9 కోట్లు

  కృష్ణా: రూ. 8 కోట్లు

  నెల్లూరు:రూ. 4.30 కోట్లు

  తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి  రూ. 107.50 కోట్లు

  కర్ణాటక : రూ. 9 కోట్లు

  రెస్టాఫ్ భారత్ : రూ.  2.70 కోట్లు

  ఓవర్సీస్ : రూ. 12 కోట్లు

  తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రూ. 131.20 కోట్లు షేర్  రాబట్టాలి. బ్రేక్ ఈవెన్ కావాలంటే.. రూ. 132.50 కోట్ల షేర్ రాబట్టాలి.

  ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా సోనూ సూద్ నటించారు. మొత్తంగా ఈ  ట్రైలర్ ను ఆధ్యాత్మికంకు నక్సలిజాన్ని మిక్స్ చేసి కొరటాల శివ సరికొత్తగా ఆచార్య సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. కొరటాల శివ ఆచార్య సినిమాను తనదైన సోషల్ మెసెజ్‌తో తెరకెక్కించినట్టు కనబడుతోంది. ఇక  ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం.ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది.

  Tollywood Top Most Profitable Movies : RRR సహా తెలుగులో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన టాప్ సినిమాలు ఇవే..

  ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God father) అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కీలకపాత్రలో కనిపించనున్నారు.

  KGF 2 WW 13 Days Box Collections : కేజీఎఫ్ ఛాప్టర్ 2 - 13 రోజుల వాల్డ్ వైడ్ కలెక్షన్లు.. అక్కడ మాత్రం భారీ నిరాశే..

  ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుంది. బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు చిరంజీవి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Acharya, Chiranjeevi, Pooja Hegde, Ram Charan, Tollywood

  ఉత్తమ కథలు