మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్‌లు కలిసి ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య అనే సినిమాలో తండ్రి కొడుకులు కలిసి నటిస్తున్నారు. (Acharya) ఆచార్య ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మే 13న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ సినిమాను మొదట దసరా అన్నారు.. ఆ తర్వాత సంక్రాంతి రేస్ లో ఉంటుందని టాక్ నడిచింది. ఇక చివరకు ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట.
ఇక అది అలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది. సిద్ధగా రామ్ చరణ్ అదరగొట్టారు. రామ్ మేకోవర్.. లుక్ బాగున్నాయి. అంతేకాదు ధర్మస్థలి గురించి రామ్ చరణ్ డైలాగ్ బాగుంది. ఇక చివరగా సిద్ధ టీజర్లో చిరంజీవి ఎంట్రీని చిరుతతో పోల్చడం అదిరిపోయింది. ఈ టీజర్‌ను నవంబర్ 28న 04 : 05 నిమిషాలకు వదిలారు. చూడాలి మరి ఈ టీజర్‌ను ఎన్ని కోట్లు వ్యూస్‌ను రాబట్టనుందో.. ఇక మరోవైపు ఈ సినిమాలో రామ్ చరణ్, పూజా హెగ్డేలకు సంబంధించిన నీలాంబరి పాట విడుదలై యూట్యూబ్‌లో మంచి ఆదరణ పొందుతోంది.
Witness #SiddhasSaga #Siddha's march towards Dharma #Acharya #AcharyaOnFeb4th #SivaKoratala @AlwaysRamCharan @hegdepooja @MsKajalAggarwal #ManiSharma @DOP_Tirru@NavinNooli @sureshsrajan @adityamusic @MatineeEnt @KonidelaPro https://t.co/lVw13ESnkb
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 28, 2021
ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
Anchor Suma: అఖండ ప్రిరిలీజ్ ఈవెంట్లో మెరిసిన యాంకర్ సుమ..
ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా చేస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. తమన్నా గతంలో ఒకసారి చిరంజీవి సరసన నటించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా చిత్రంలో తమన్నా (Tamannaah) తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకి ఇది రెండో సినిమా అని చెప్పాలి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aacharya, Pooja Hegde, Ram Charan, Tollywood news