హోమ్ /వార్తలు /సినిమా /

Acharya Twitter Review : చిరంజీవి.. రామ్ చరణ్‌ల ఆచార్య ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ..

Acharya Twitter Review : చిరంజీవి.. రామ్ చరణ్‌ల ఆచార్య ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ..

Chiranjeevi - Ram Charan Acharya Twitter Review Photo Twitter

Chiranjeevi - Ram Charan Acharya Twitter Review Photo Twitter

Chiranjeevi - Ram Charan - Acharya Twitter Review |  చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి  నటిస్తున్న సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలవుతోంది. 132.50 కోట్ల టార్గెట్‌తో ఆచార్య బరిలో దిగుతోంది. ఇప్పటికే పలు చోట్ల ప్రిమియర్ షోస్ పడ్డాయి. దీంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

ఇంకా చదవండి ...

Chiranjeevi - Ram Charan - Acharya Twitter Review |  మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) న‌టించిన ప్రతిష్టాత్మక చిత్రం 'ఆచార్య' (Acharya). ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి  నటిస్తున్న సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వం వహిస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలవుతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలవుతోంది. 132.50 కోట్ల టార్గెట్‌తో ఆచార్య బరిలో దిగుతోంది. ఇక అది అలా ఉంటే ఇప్పటికే పలు చోట్ల ప్రిమియర్ షోస్ పడ్డాయి. దీంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ సినిమా ఎలా ఉంది. అసలు కథేంటీ.. కొరటాల శివ ఈ సారి ఏం మేసేజ్ ఇచ్చారు. చిరంజీవి, రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా తెలుగు వారిని ఎంత మాత్రం అలరించనుంది.. వంటి అంశాలను సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. అవేంటో చూద్దాం.. అయితే ట్రైలర్‌కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్ లోనే మోస్ట్ వ్యూడ్ ట్రైలర్ ఆచార్య రికార్డు క్రికెట్ చేసింది. 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ట్రైలర్‌ను బట్టి చూస్తే.. ఆధ్యాత్మికంకు నక్సలిజాన్ని మిక్స్ చేసి కొరటాల శివ సరికొత్తగా ఆచార్య సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ 4 రోజుల ముందే మొదలైంది. పైగా తెలంగాణలో ఐదో ఆటతో పాటు వారం రోజుల పాటు ఈ సినిమాకు రూ. 50 పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. ఇక ఏపీలో 10 రోజుల పాటు 50 రూపాయలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్ డే బుకింగ్స్ మెగా ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్టు లేదనే టాక్ ప్రీ బుకింగ్స్ చూస్తే తెలుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర తండ్రీ తనయులు రచ్చ మాత్రం అనుకున్నంత రేంజ్‌లో లేదని తెలుస్తోంది. టిక్కెట్స్ రేట్స్ హైక్‌గా ఉండటం.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాల హైప్‌తో పోలిస్తే తక్కువగా ఉందని అంటున్నారు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan)  సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట.

ఆ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) జోడిగా నటించగా ఆ తర్వాత ఆమె పాత్రను తొలగించినట్లు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం.ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God father) అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుంది.

KGF 2 Vs RRR : బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాలు.. కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ ప్లేస్ ఎక్కడంటే..

ఈ రెండు సినిమాలతో పాటు బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు చిరంజీవి. ఇక మరోవైపు చిరంజీవి తాజాగా మరో సినిమాకు ఓకే అన్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా దాదాపుగా ఖరారు అయ్యిందని అంటున్నారు. మలయాళంలో మోహన్‌ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన ‘బ్రో డాడీ’ (Bro Daddy) సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని టాక్. మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్‌ లాల్ (Mohan Lal), పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) పాత్రలను తెలుగులో చిరంజీవి, సాయి ధరమ్ (Sai Dharam Tej) తేజ్ కలిసి చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

First published:

Tags: Acharya, Chiranjeevi, Pooja Hegde, Ram Charan

ఉత్తమ కథలు