హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi | Acharya : ఆచార్య విషయంలో చిరంజీవి, కొరటాల శివ మధ్య విభేదాలకు కారణం ఏంటీ..

Chiranjeevi | Acharya : ఆచార్య విషయంలో చిరంజీవి, కొరటాల శివ మధ్య విభేదాలకు కారణం ఏంటీ..

Chiranjeevi - Ram Charan :  మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి  నటిస్తున్న సినిమా ‘ఆచార్య’ (Acharya). కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలకానుంది.

ఇంకా చదవండి ...

    Chiranjeevi - Ram Charan :  మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి  నటిస్తున్న సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలకానుంది. అయితే ఈ సినిమా రన్ టైమ్ విషయంలో దర్శకుడు, హీరో తర్జనభర్జనలుపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిడివి 3 గంటలకి పైగా వచ్చిందట. దీంతో మూడు గంటల నిడివి బాగుంటుందా.. లేక బోర్ అనిపిస్తుందా.. అనే విషయంలో హీరో చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ తర్జనభర్జనలు పడుతున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఓ ముప్పై నిమిషాల పాటు నిడివిని తగ్గిస్తే.. ఎలా ఉంటుందా అనే విషయంలో ఇద్దరి మధ్య చర్చ సాగుతోందట. అయితే ఈ  (Acharya ) విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా విడుదల విషయంలో చాలా వాయిదాల తర్వాత.. ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రంలో చిరంజీవి‌తో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan)  సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట. ఆ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) జోడిగా నటిస్తుండగా.. రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటిస్తున్నారు.

    మరోవైపు ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం. ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది.

    ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుంది. బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు.

    First published:

    Tags: Aacharya, Chiranjeevi, Pooja Hegde, Ram Charan

    ఉత్తమ కథలు