Home /News /movies /

CHIRANJEEVI RAM CHARAN ACHARYA FIRST DAY COLLECTIONS SR

Acharya First Day Collections : అంచనాలను అందులేకపోయిన ఆచార్య....

Acharya (Twitter/Photo)

Acharya (Twitter/Photo)

Acharya First Day Collections : ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి  నటించిన సినిమా కావడం వల్ల ‘ఆచార్య’ (Acharya)పై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్‌లో రావడం కూడా అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాకు మొదటి షోనుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది.

ఇంకా చదవండి ...
    Chiranjeevi Acharya First Day Collections | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) న‌టించిన ప్రతిష్టాత్మక చిత్రం 'ఆచార్య' (Acharya). ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి  నటించిన సినిమా కావడం వల్ల ‘ఆచార్య’ (Acharya)పై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్‌లో రావడం కూడా అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాకు మొదటి షోనుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని, గ్రాఫిక్స్ చెత్తగా ఉన్నాయని.. ఇద్దరూ స్టార్స్ ఉన్నా సినిమా ఎక్కడా కనెక్ట్ అవ్వడం లేదని టాక్ వచ్చింది. ఇక అదే కలెక్షన్స్ విషయంలో కూడా కనిపించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. అంతేకాదు 132.50 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలో దిగింది. చూద్దాం మరి ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో.. ఆచార్య సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అనుకున్న టార్గెట్‌ను అందుకోలేక పోయింది. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో18.69 కోట్ల షేర్‌ను సొంతం చేసుకోగా 10.81 కోట్ల హైర్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ టైమ్‌లో విడుదలైన స్టార్ హీరోల సినిమాలతో పోల్చితే.. వన్ ఆఫ్ లోవేస్ట్ వర్త్ షేర్‌‌ని సొంతం చేసుకుందని అంటున్నారు.

    ఆచార్య ఫస్ట్ డే కలెక్షన్స్
    Nizam: 7.90Cr
    Ceeded: 4.60Cr(1.75Cr హైర్స్)
    UA: 3.61Cr(1Cr~ హైర్స్)
    East: 2.53Cr(1.30Cr~ హైర్స్)
    West: 2.90Cr(2Cr~ హైర్స్)
    Guntur: 3.76Cr(2.25Cr హైర్స్)
    Krishna: 1.90Cr(1Cr~ హైర్స్)
    Nellore: 2.30Cr(1.51Cr హైర్స్)
    AP-TG Total:- 29.50CR(40.00CR~ Gross)(10.81CR హైర్స్)
    Ka+ROI – 1.70Cr
    OS – 3.85Cr
    వరల్డ్ వైడ్ మొత్తంగా : 35.05CR(52CR~ Gross)


    ఇక ఈ సినిమా మొత్తం మీద 131.20 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేయగా.. 132.50 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో మొదటి రోజు కలెక్షన్స్‌ను మినహా ఇస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 97.45 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టాలి. చూడాలి ఏమాత్రం అందుకుంటుందో.. అయితే ఈ సినిమా ట్రైలర్‌కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్ లోనే మోస్ట్ వ్యూడ్ ట్రైలర్ ఆచార్య రికార్డు క్రికెట్ చేసింది. 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించారు. రామ్ చరణ్ (Ram Charan)  సిద్ద పాత్రలో అదరగొట్టారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) జోడిగా నటించగా ఆ తర్వాత ఆమె పాత్రను తొలగించారు దర్శక నిర్మాతలు. ఇక రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం.ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్

    ఇక ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God father) అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుంది.

    ఆచార్య విలన్‌కు పాలాభిషేకం చేసిన ఫ్యాన్స్.. గుమ్మడికాయతో దిష్టి కూడా తీశారు

    ఈ రెండు సినిమాలతో పాటు బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు చిరంజీవి. ఇక మరోవైపు చిరంజీవి తాజాగా మరో సినిమాకు ఓకే అన్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా దాదాపుగా ఖరారు అయ్యిందని అంటున్నారు. మలయాళంలో మోహన్‌ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన ‘బ్రో డాడీ’ (Bro Daddy) సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని టాక్. మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్‌ లాల్ (Mohan Lal), పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) పాత్రలను తెలుగులో చిరంజీవి, సాయి ధరమ్ (Sai Dharam Tej) తేజ్ కలిసి చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Aacharya, Acharya, Chiranjeevi, Ram Charan, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు