Chiranjeevi Acharya Closing Collections | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'ఆచార్య' (Acharya). ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా కావడం వల్ల ‘ఆచార్య’ (Acharya)పై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్‌లో రావడం కూడా అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాకు మొదటి షోనుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని, గ్రాఫిక్స్ చెత్తగా ఉన్నాయని.. ఇద్దరూ స్టార్స్ ఉన్నా సినిమా ఎక్కడా కనెక్ట్ అవ్వడం లేదని టాక్ వచ్చింది. ఇక అదే కలెక్షన్స్ విషయంలో కూడా కనిపించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. అంతేకాదు 132.50 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలో దిగింది. మొదటి రోజే ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో చేతులేత్తేసింది. ఇక రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా నిరాశ పరిచింది. ఇక ఆ తర్వాత ఎక్కడా పుంజుకోలేదు. దీంతో అటు బయ్యర్స్‌కు ఇటు డిస్ట్రిబ్యూటర్స్‌కు నష్టాల పాలైనట్లు సమాచారం. అయితే నిర్మాతలు, చిరంజీవి, దర్శకుడు కొరటాల తమ రెమ్యూనరేషన్‌లో కొంత భాగం వెనుక్కి ఇచ్చినట్లు సమాచారం.
ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్స్ ఎంత.. బిజినెస్ ఎంత చేసిందో చూద్దాం.. చిరంజీవి, రామ్ చరణ్‌ల కాంబో మూవీ ఆచార్య ఆల్ టైమ్ ఎపిక్ డిజాస్టర్స్ మిగిలింది. థియేట్రికల్‌గా (Acharya Closing Collections) బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకుంది.
రోజుల వారిగా ఆచార్య ఏపీ తెలంగాణ కలెక్షన్స్ చూస్తే..
మొదటి రోజు : 29.50 కోట్లు
రెండో రోజు : 5.15 కోట్లు
3వ రోజు: 4.07 కోట్లు
4వ రోజు: 53 లక్షలు
5 రోజు 5: 82 లక్షలు
6వ రోజు: 26 లక్షలు
7వ రోజు: 12 లక్షలు
8వ రోజు: 8 లక్షలు
9వ రోజు: 6 లక్షలు
10వ రోజు: 8 లక్షలు
11వ రోజు: 3 లక్షలు
12వ రోజు: 2 లక్షలు
13వ రోజు: 1 లక్షలు
మిగిలిన రోజులు: 4 లక్షలు
ఏపీ తెలంగాణ మొత్తం వసూళ్లు : 40.77CR (59.85CR~ గ్రాస్)
ఆచార్య టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
నైజాం: 12.45 కోట్లు
సీడెడ్: 6.21కోట్లు
ఉత్తరాంధ్ర : 4.85 కోట్లు
తూర్పు: 3.24 కోట్లు
పశ్చిమ: 3.40 కోట్లు
గుంటూరు: 4.59 కోట్లు
కృష్ణ: 3.09 కోట్లు
నెల్లూరు: 2.94 కోట్లు
ఏపీ తెలంగాణ మొత్తం - 40.77CR(59.85 కోట్లు~ గ్రాస్)
కర్నాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా – 2.80 కోట్లు
ఓవర్సీస్ - 4.78Cr
వరల్డ్ వైడ్ మొత్తం : 48.36CR (76.00 కోట్లు~గ్రాస్), 84.14 కోట్లు నష్టం.
ఆచార్య ప్రి రిలీజ్ బిజినెస్ 131.20 కోట్లకు చేయగా.. బ్రేక్ ఈవెన్ కావాలంటే 132.50 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే కలెక్షన్స్ అనుకున్న రితీలో రాక ఈ సినిమా దాదాపు 84.14 కోట్లు కోల్పోయి.. ఆల్ టైమ్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించారు. రామ్ చరణ్ (Ram Charan) సిద్ద పాత్రలో అదరగొట్టారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) జోడిగా నటించగా ఆ తర్వాత ఆమె పాత్రను తొలగించారు దర్శక నిర్మాతలు.
ఇక రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయింది. ఈ సినిమా మే 20న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God father) అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుంది.
ఈ రెండు సినిమాలతో పాటు బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు చిరంజీవి. ఇక మరోవైపు చిరంజీవి తాజాగా మరో సినిమాకు ఓకే అన్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా దాదాపుగా ఖరారు అయ్యిందని అంటున్నారు. మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన ‘బ్రో డాడీ’ (Bro Daddy) సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని టాక్.
మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్ లాల్ (Mohan Lal), పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) పాత్రలను తెలుగులో చిరంజీవి, సాయి ధరమ్ (Sai Dharam Tej) తేజ్ కలిసి చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acharya, Chiranjeevi, Ram Charan