చలించిపోయిన చిరంజీవి.. మీరు గొప్ప స్ఫూర్తి అంటూ కితాబు..

మతిస్థిమితం లేని మహిళకి అన్నం తినిపించిన మహిళా పోలీస్ అధికారి శుభశ్రీకి సంబంధించిన కొన్ని వీడియోలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: May 12, 2020, 12:10 PM IST
చలించిపోయిన చిరంజీవి.. మీరు గొప్ప స్ఫూర్తి అంటూ కితాబు..
చిరంజీవి, పోలీస్ అధికారి శుభశ్రీ Photo : Twitter
  • Share this:
కరోనా కారణంగా ఏర్పడ్డ లాక్‌డౌన్‌ వల్ల ఆకలితో అలమటిస్తోన్న ఓ మతిస్థిమితం లేని మహిళకి అన్నం తినిపించిన మహిళా పోలీస్ అధికారి శుభశ్రీకి సంబంధించిన కొన్ని వీడియోలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియో చూసిన మెగాస్టార్ చిరంజీవి ఆమెతో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆమెను అభినందించి, అందరికీ స్ఫూర్తివంతంగా నిలిచారని ప్రశంసించారు. దానికి సంబందించిన ఓ వీడియోను చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. నమస్తే శుభశ్రీ గారు. కొన్ని రోజుల క్రితం నేను మీ వీడియో ఒకటి చూశాను. అందులో మీరు ఓ మతి స్థిమితం లేని వృద్ద మహిళకి భోజనం తినిపిస్తున్నారు. అది నా మనసుని ఎంతోగాను తాకింది. నన్ను చలింపజేసింది. ఇక ఆ రోజు నుంచి నేను మీతో మాట్లాడాలని చాలా ప్రయత్నించాను. మీరు ఆ వ్యక్తి పట్ల అంత ఆదరణతో పాటు ఎంతో బాధ్యతగా ఈ పని చేయడానికి కారణమేంటీ? అని ప్రశ్నించారు. దీనికి ఆమె బదులిస్తూ.. నేను ఆవిడకి ప్రత్యేకించి ఏమీ చేయలేదు సార్... నేను భోజనం అందించే సమయంలో ఆ వ్యక్తి స్వయంగా తినే కండిషన్‌లో లేదు. దీంతో నేను ఆమెకు తినిపించానని పేర్కోంటూ.. బాధ్యతలు నిర్వర్తించడం అంటే లా అండ్ ఆర్డర్‌ మాత్రమే కాపాడడం కాదని తెలిపింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఈ సామాజిక సేవను ఇలానే కొనసాగించాలని ఆ అధికారిని ప్రోత్సహించారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

Published by: Suresh Rachamalla
First published: May 12, 2020, 12:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading