Narappa : నారప్పలో వెంకటేష్ ఎక్కడా కనిపించలేదు : చిరంజీవి కామెంట్స్

Chiranjeevi Photo : Twitter

Narappa : విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళ సినిమా అసురన్‌కు తెలుగు రీమేక్‌గా వచ్చిన చిత్రం 'నారప్ప'. 

  • Share this:
    విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళ సినిమా అసురన్‌కు తెలుగు రీమేక్‌గా వచ్చిన చిత్రం 'నారప్ప'.  ఈ సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఏమోషనల్ సీన్స్‌లో వెంకటేష్ అదరగొట్టారు. ఒరిజినల్ వెర్షన్ కి ఎక్కడా తగ్గకుండా శ్రీకాంత్ అడ్డాల టేకింగ్ కానీ చూపించిన విజువల్స్ కానీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అలాగే వెంకటేష్, ప్రియమణిల నటన మరో ఎత్తుకు తీసుకెళ్తుందని చెప్పోచ్చు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడ అదిరింది. రెండు పాత్రల్లో వెంకీ ఇరగదీశారు. ఇక ఈ సినిమాను చూసిన చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి సినిమా ఇది. తెరపై నాకు 'నారప్ప అనే పాత్ర తప్ప ఎక్కడా కూడా వెంకటేష్ కనిపించలేదు. ఆయన ఆ పాత్రను లోతుగా అర్థం చేసుకున్నారు. నారప్ప వెంకటేష్ కెరియర్‌లోనే గర్వంగా చెప్పుకునే గొప్ప సినిమా ఇది అని అన్నారు. దీనికి సంబంధించి ఓ ఆడియో నోట్‌ను విడుదల చేశారు. తనపై తన సినిమాపై చిరంజీవి అభినందనల పట్ల వెంకటేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన థాంక్స్ చెప్పారు.


    ఇక ఈ సినిమా టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సామ్‌.కె నాయుడు అందించంగా మణిశర్మ సంగీతం అందించారు. ఎడిటర్ గా మార్తాండ్ కె. వెంకటేష్‌ పని చేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నారప్ప తమిళ సినిమా 'అసురన్’కు రీమేక్‌గా వస్తోంది. తమిళంలో ధనుష్ నటించిన ఆ సినిమా దళిత నేపథ్య కథతో వచ్చి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తమిళ మాతృకను వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ధనుష్‌కు జంటగా మళయాల నటి మంజు వారియర్ నటించిగా.. అదే పాత్రలో తెలుగులో ప్రియమణి కనిపించారు. ఈ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మించారు.
    Published by:Suresh Rachamalla
    First published: