హోమ్ /వార్తలు /సినిమా /

కార్తికేయ, ఈషా రెబ్బాలతో కలిసి ఆ వీడియోలో అదరగొట్టిన చిరంజీవి..

కార్తికేయ, ఈషా రెబ్బాలతో కలిసి ఆ వీడియోలో అదరగొట్టిన చిరంజీవి..

కార్తికేయ, చిరంజీవి, ఈషా రెబ్బా Photo : Twitter

కార్తికేయ, చిరంజీవి, ఈషా రెబ్బా Photo : Twitter

కరోనా మహమ్మారికి అందరూ సమానమే. ఇది సామాన్యుల నుండి సెలెబ్రీల వరకు ఎవరని వదలకుండా చుక్కలు చూపిస్తోంది.

  కరోనా మహమ్మారికి అందరూ సమానమే. ఇది సామాన్యుల నుండి సెలెబ్రీల వరకు ఎవరని వదలకుండా చుక్కలు చూపిస్తోంది. దీంతో ఈ వ్యాది రాకుండా ఇప్పటికే చాలా సార్లు అనేక రూపాల్లో ప్రజలకు అవగాహాన కల్పించారు మన తెలుగు సినీ నటులు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను పోస్ట్ చేశాడు. కరోనాను ఎలా కట్టడి చేయాలో తెలుపుతూ ఓ వీడియోను ఆయన మాస్క్ ధరించడం ఎంత ముఖ్యమో తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ టెడ్రోస్ అథనోమ్ ఈ నెల 13న ఓ విషయాన్ని తెలిపారని.. కరోనా వచ్చే రోజుల్లో మరింతగా ప్రభలే అవకాశం ఉంటుందనే విషయాన్ని చెప్పారని గుర్తు చేశాడు. దీన్ని అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి ప్రబలకుండా తమ వంతు కృషి చేయాలని, కరోనా సంక్రమణకు ముగింపు పలకాలని చెప్పారని చిరు తెలిపాడు.


  ఈ వీడియోలో హీరోయిన్ ఈషా రెబ్బాతో పాటు, నటుడు కార్తికేయ కూడా పాల్గొంటూ ప్రజలకు మాస్కుల ధరించడం ఎంత ముఖ్యమో తెలిపే ప్రయత్నం చేశారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్యలో నటిస్తున్నాడు. దాదాపు సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Chiranjeevi, Eesha Rebba, Kartikeya, Tollywood news

  ఉత్తమ కథలు