Chiranjeevi:శ్రీ మంజునాథ కంటే ముందు చిరంజీవి పౌరాణిక పాత్ర వేసిన సినిమా ఏమిటో తెలుసా..

‘శ్రీమంజునాథ’గా చిరంజీవి (File/Photo)

Chiranjeevi | చిరంజీవి ’శ్రీమంజునాథ’ కంటే ముందు ఓ సినిమాలో పౌరాణిక పాత్రలో కనిపించారు. ఇక మెగాస్టార్ తన కెరీర్‌లో చేసిన చిత్రాల్లో దాదాపు అన్ని సాంఘిక చిత్రాలే చేసారు.

  • Share this:
    Chiranjeevi | చిరంజీవి ’శ్రీమంజునాథ’ కంటే ముందు ఓ సినిమాలో పౌరాణిక పాత్రలో కనిపించారు. ఇక మెగాస్టార్ తన కెరీర్‌లో చేసిన చిత్రాల్లో దాదాపు అన్ని సాంఘిక చిత్రాలే చేసారు. మొత్తంగా కెరీర్‌లో శ్రీమంజునాథ సినిమాలో మాత్రమే పౌరాణిక సినిమా. ఈ చిత్రంలో చిరంజీవి శ్రీమంజునాథుడైన శివుడి పాత్రలో అద్భుత అభినయం కనబరిచారు. ఇన్నేళ్ల కెరీర్‌లో తొలిసారి చారిత్రక యోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో పోషించారు. అటు జానపద సినిమా విషయానికొస్తే.. శివుడు శివుడు శివుడు సినిమాను కాస్త రాజుల కాలం నాటి జానపద సినిమా అని చెప్పొచ్చు. కానీ చిరంజీవి తన సినీ జీవితంలో ‘’ఆపద్భాంధవుడు’ సినిమాలో శివుడి వేషంలో కనిపించారు.

    ‘ఆపద్భాందవుడు’ సినిమాలో శివుడిగా చిరంజీవి (File/Photo)


    అటు  రామాయణం, మహాభారతంలోని ఏ పాత్రలు పోషించలేకపోయారు. కానీ ఓ సినిమాలో భాగంగా అర్జునుడి వేషం వేసారు. అదే సినిమా అంటే ‘స్టేట్ రౌడీ’. ఈ మూవీలో భాగంగా గయోపాఖ్యానం ఉంటుంది. అందులో భాగంగా చిరంజీవి అర్జునుడి వేషం వేస్తే.. నూతన్ ప్రసాద్ శ్రీకృష్ణుడి పాత్ర వేసారు.

    Megastar Chiranjeevi As Arjuna Charecter In State Rowdy News18
    అర్జునుడి పాత్రలో చిరంజీవి (Twitter/Photo)


    అటు గయుడి పాత్రలో రావు గోపాల రావు నటించారు. సినిమాలో భాగంగా ఐదు నిమిషాల సన్నివేశం అద్బుతంగా ఉంటుంది.  ఈ సినిమాలో అర్జునుడి వేషంలో ఆగికంగా కానీ వాచకంగా కానీ అద్భుతాభినయం కనబరిచారు.  ఈ సినిమాను బి.గోపాల్ డైరెక్ట్ చేస్తే.. టి. సుబ్బరామిరెడ్డి నిర్మించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మొత్తంగా చిరంజీవి భవిష్యత్తులో రామాయణం, మహాభారతంలోని ఏదైనా పాత్ర పోషిస్తే.. చూడాలనుకునే అభిమానులు ఉన్నారు. మరి భవిష్యత్తులో చిరంజీవి అభిమానుల కోరిక తీర్చడానికి పూనుకుంటారా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: