చిరంజీవి అర్జునుడిగా కనిపించింది ఏ సినిమాలో తెలుసా..

మెగాస్టార్ చిరంజీవి తన సినీ జీవితంలో రామాయణం, మహాభారతంలోని ఏ పాత్రలు పోషించలేకపోయారు. కానీ ఓ సినిమాలో భాగంగా అర్జునుడి వేషం వేసారు. ఇంతకీ ఏ సినిమాలో తెలుసా..

news18-telugu
Updated: June 2, 2020, 10:04 AM IST
చిరంజీవి అర్జునుడిగా కనిపించింది ఏ సినిమాలో తెలుసా..
అర్జునుడి పాత్రలో చిరంజీవి (Twitter/Photo)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో చేసిన చిత్రాల్లో దాదాపు అన్ని సాంఘిక చిత్రాలే చేసారు. మొత్తంగా కెరీర్‌లో శ్రీమంజునాథ సినిమాలో మాత్రమే పౌరాణిక సినిమా. ఈ చిత్రంలో చిరంజీవి శ్రీమంజునాథుడైన శివుడి పాత్రలో అద్భుత అభినయం కనబరిచారు. ఇన్నేళ్ల కెరీర్‌లో తొలిసారి చారిత్రక యోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో పోషించారు. అటు జానపద సినిమా విషయానికొస్తే.. శివుడు శివుడు శివుడు సినిమాను కాస్త రాజుల కాలం నాటి జానపద సినిమా అని చెప్పొచ్చు. కానీ చిరంజీవి తన సినీ జీవితంలో రామాయణం, మహాభారతంలోని ఏ పాత్రలు పోషించలేకపోయారు. కానీ ఓ సినిమాలో భాగంగా అర్జునుడి వేషం వేసారు. అదే సినిమా అంటే ‘స్టేట్ రౌడీ’. ఈ మూవీలో భాగంగా గయోపాఖ్యానం అనే ఎసిపోడ్ ఉంటుంది. అందులో భాగంగా చిరంజీవి అర్జునుడి వేషం వేస్తే.. నూతన్ ప్రసాద్ శ్రీకృష్ణుడి పాత్ర వేసారు. అటు గయుడి పాత్రలో రావు గోపాల రావు నటించారు. సినిమాలో భాగంగా ఐదు నిమిషాల సన్నివేశం అద్బుతంగా ఉంటుంది.  ఈ సినిమాలో అర్జునుడి వేషంలో ఆంగికంగా కానీ వాచకంగా కానీ అద్భుతాభినయం చేసారు చిరంజీవి. ఈ సినిమాను బి.గోపాల్ డైరెక్ట్ చేస్తే.. టి. సుబ్బరామిరెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. మొత్తంగా చిరంజీవి భవిష్యత్తులో రామాయణం, మహాభారతంలోని ఏదైనా పాత్ర పోషిస్తే.. చూడాలనుకునే అభిమానులు ఉన్నారు. మరి భవిష్యత్తులో చిరంజీవి అభిమానుల కోరిక తీర్చడానికి పూనుకుంటారా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 2, 2020, 10:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading