Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: December 24, 2019, 4:44 PM IST
మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ (Chiranjeevi pawan Kalyan nagababu)
నమ్మడానికి ఇది కాస్త కష్టంగా అనిపిస్తుంది కానీ ప్రస్తుతం మాత్రం జరుగుతుంది ఇదే. కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం అన్నట్లు మారిపోయింది ఇప్పుడు నాగబాబు పరిస్థితి. నిజంగానే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయాడు మెగా బ్రదర్. అంత కష్టాలేమొచ్చాయి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నాగబాబును చూస్తుంటే నిజంగానే పాపం అనిపిస్తుంది. దానికి కారణం కూడా లేకపోలేదు. చాలా రోజులుగా సినిమాలు తప్ప మరో ధ్యాసే లేని చిరంజీవి.. ఉన్నట్లుండి మూడు రాజధానుల విషయంలో మాట్లాడాడు. మాట్లాడిన వాడు ఊరికే ఉండకుండా జగన్కు ఫుల్ సపోర్ట్ చేసాడు.

పవన్ కల్యాణ్,చిరంజీవి,వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఆయన లేకుంటే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం కాదనే రేంజ్లో పొగిడేసాడు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ మాత్రం జగన్ ప్రతిపాదనను తోసిపుచ్చాడు. ఈయన మూడు రాజధానుల విషయంలో చాలా సీరియస్ అయ్యాడు. నాలుగు భవనాలు.. నాలుగు రోడ్లు వేసినంత మాత్రానా రాజధాని కాదు జగన్ గారూ అంటూ విమర్శించాడు పవర్ స్టార్. ఇలాంటి సమయంలో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి మాత్రం జగన్కు సపోర్ట్ చేయడంతో పవన్ ఒక్కడే కాదు.. ఆయన వెంట ఉన్న నాగబాబుకు కూడా కరెంట్ షాక్ కొట్టింది.

మెగా బ్రదర్స్ ట్విట్టర్ ఫోటో
ఇప్పుడు తమ్ముడి వెంట నడవాలా లేదంటే దేవుడిగా భావించే అన్నయ్యను సపోర్ట్ చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడు నాగబాబు. చిరు మాటలు విన్న తర్వాత కూడా జై జనసేన అంటున్నాడు నాగబాబు. అంటే అన్న కంటే తమ్ముడికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు మెగా బ్రదర్. ఇప్పటికీ ఎప్పటికీ తన అడుగులు జనసేనతోనే అంటున్నాడు ఈయన. రైతులకు జగన్ తీరని అన్యాయం చేస్తున్నాడంటూ ఓ సంచలన వీడియో కూడా విడుదల చేసాడు నాగబాబు. మొత్తానికి మరి ఈ మెగా డ్రామా ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలిక.
Published by:
Praveen Kumar Vadla
First published:
December 24, 2019, 4:44 PM IST