Home /News /movies /

CHIRANJEEVI PAWAN KALYAN NAGA BABU ALL TOGETHER CELEBRATED THEIR MOTHER ANJANA DEVI BIRTHDAY PK

Anjana Devi birthday celebrations: అమ్మ పుట్టిన రోజు అందరితో కలిసి.. ఘనంగా అంజనా దేవి బర్త్ డే సంబరాలు..

అంజనా దేవి పుట్టిన రోజు సంబరాలు (Anjana Devi birthday)

అంజనా దేవి పుట్టిన రోజు సంబరాలు (Anjana Devi birthday)

Anjana Devi birthday celebrations: అంజనా దేవి.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి అమ్మగారు ఈమె. ఆయనతో పాటు మరో ఇద్దరు కుమారులకు తల్లి. ముగ్గురు మొనగాళ్లను కన్న అమ్మ అంజనా దేవి..

అంజనా దేవి.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి అమ్మగారు ఈమె. ఆయనతో పాటు మరో ఇద్దరు కుమారులకు తల్లి. ముగ్గురు మొనగాళ్లను కన్న అమ్మ అంజనా దేవి అంటూ మెగా ఫ్యాన్స్ ఎప్పుడూ సరదాగా చెప్పుకుంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ముగ్గురూ ముగ్గురే.. అలాంటి స్టార్స్‌కు జన్మనిచ్చిన అమ్మ పుట్టిన రోజు జనవరి 29. అందుకే ఈ సకుటుంబ సపరివార సమేతంగా అమ్మ పుట్టిన రోజును అద్భుతంగా జరిపారు కుటుంబ సభ్యులు. మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఒక్కచోట చేరి అమ్మగారి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు నాగబాబు దంపతులు, పవన్ కళ్యాణ్, ఆయన ఇద్దరు అక్కలు అంతా కలిసి అమ్మ పుట్టిన రోజు ఘనంగా సెలబ్రట్ చేసారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మ గురించి ఎమోషనల్ అవుతూ నాగబాబు కూడా పోస్ట్ పెట్టాడు. కొంతమంది మనకు అనంతమైన ఆనందాన్ని ఇస్తుంటారు.. కొన్ని సందర్భాలు సెలబ్రేట్ చేసుకోడానికి చాలా బాగుంటాయి.. కానీ ఇవన్నీ మేం ఈరోజు అనుభవించడానికి, సెలబ్రేట్ చేసుకోడానికి అసలైన కారణం నువ్వే అమ్మ.. నీ పుట్టిన రోజు అంటే మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే.. పూర్తికాని ఓ పండగ అమ్మ అంటూ పోస్ట్ చేసాడు నాగబాబు.

అందులో మెగా కుటుంబం అంతా ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Mega Family, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు